ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్. హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. థియేటర్స్‌లోనే కాకుండా ఓటీటీలోనూ సత్తా చాటిన ఈ సినిమాకి మాధవన్ హీరోగా, దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం మాధవన్ తన ఇంటిని అమ్ముకోవాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయ్యింది. రాకెట్రీ సినిమాని నిర్మించడం కోసం మాధవన్ తన ఇల్లు అమ్మేశారని, ఈ మూవీని తొలుత ఒక ప్రముఖ దర్శకుడు డైరెక్ట్ చేయాల్సి ఉందని, అయితే అతను ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడం వల్ల రాకెట్రీ నుండి తప్పుకున్నారని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బాగా చక్కెర్లు కొట్టింది.
ఈ విషయం తన దృష్టికి రావడంతో దీనిపై మాధవన్ క్లారిటీ ఇచ్చారు. ‘దయచేసి నేనేదో గొప్ప త్యాగం చేశానని నా మీద అతి భక్తి చూపించకండి. నేను ఇల్లునో లేదా ఇంకేదో దాన్నో అమ్ముకోలేదు. నిజం చెప్పాలంటే.. రాకెట్రీ సినిమా చేయడం వల్ల ఈ ఏడాది గర్వపడే విధంగా భారీ ఆదాయపన్ను చెల్లించాము. దేవుడి దయ వల్ల మేమంతా మంచి లాభాలను, గర్వించే లాభాలను పొందాము. నేను ఇప్పటికీ నా ఇంటిని ప్రేమిస్తున్నాను. ఆ ఇంటిలోనే జీవిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. అభిమానం ఉండచ్చు, కానీ మరీ నటుడి మీద అభిమానంతో అబద్ధాలను ప్రచారం చేసేంతగా అభిమానం ఉండకూడదనేది మాధవన్ అభిప్రాయం. మరి మాధవన్‌పై వచ్చిన తప్పుడు ప్రచారం గురించి, అలానే దాన్ని ఖండించిన మాధవన్‍పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
Oh Yaar. Pls don’t over patronize my sacrifice. I did not lose my house or anything. In fact all involved in Rocketry will be very proudly paying heavy Income Tax this year. Gods grace 😃😃🙏🙏🇮🇳🇮🇳🇮🇳We all made very good and proud profits. I still love and live in my house .🚀❤️ https://t.co/5L0h4iBert
— Ranganathan Madhavan (@ActorMadhavan) August 17, 2022