టీఆర్పీల రేటింగ్ కోసం ఈ మధ్యకాలంలో పలు షోలలో కొందరు నటీనటుల మధ్య లవ్ ట్రాక్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా బాగా పాపులర్ అయిన జంట రష్మీ-సుధీర్. బుల్లితెర మీద ఈ జంటకున్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. నిజంగా వీరిద్దరూ లవర్స్ అని నమ్ముతారు చాలా మంది. కానీ తమ మధ్య అలాంటిది ఏం లేదని.. స్క్రీన్ మీద మాత్రమే అలా కనిపిస్తామని చెప్పుకొచ్చారు. ఇక రష్మీ-సుధీర్ తర్వాత ఆ రేంజ్ అభిమానం సంపాదించుకున్న జంట వర్ష-ఇమ్మానుయేల్. వీరిద్దరూ కూడా స్క్రీన్ మీద లవర్స్‌గా కనిపించి అలరించారు. ఇక టీఆర్పీ రేటింగ్ కోసం ఇప్పటికే వీరికి రెండు, మూడు సార్లు పెళ్లి కూడా చేశారు. ఇక వర్ష అయితే పలు సందర్భాల్లో.. ఇమ్మానుయేల్ అంటే తనకు ఎంతిష్టమో చెప్పుకొచ్చింది. చాలా సార్లు తీవ్ర భావోద్వాగానికి గురయ్యింది. ఇక వీరిద్దరూ రియల్ లవర్సా.. లేక రేటింగ్ కోసం ఇలా యాక్ట్ చేస్తున్నారా అనే అనుమానం చాలా మందికి ఉంది.
ఈ క్రమంలో నవంబర్ 11న ప్రసారం కాబోయే ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమో విడుదల చేశారు. ఇక ఈ ఎపిసోడ్‌కి కృష్ణ భగవాన్, పోసాని కృష్ణమురళి జడ్జిలుగా వ్యవహరించారు. ఈ క్రమంలో పోసాని కృష్ణమురళి.. ఇమ్మానుయేల్-వర్ష జంటను ఉద్దేశించి.. మీరిద్దరూ నిజంగా లవర్సా.. లేక స్క్రీన్ మీద మాత్రమే ఇలా నటిస్తారా అని అడిగాడు. అందుకు ఇమ్మానుయేల్.. ‘‘అది ఆ అమ్మాయే చెప్పాలి సార్.. తను నిజంగానే నన్ను లవ్ చేస్తున్నాను అంటే.. ఇప్పటికిప్పుడే ఇక్కడే తాళి కడతాను’’ అన్నాడు. అందుకు పోసాని కృష్ణమురళి.. ఆ అమ్మాయికి లవ్ ఉందో లేదో తెలియదు కానీ.. నీ నిజాయతీ మాత్రం నాకు నచ్చింది అంటాడు. అందుకు ఇమ్ము థాంక్యూ సార్.. కావాలంటే దాన్ని సైడ్ చేసి మనిద్దరం పెళ్లి చేసుకుందాం అనగానే పోసానితో పాటు అందరూ షాకవుతారు.
ఇక వెంటనే గెటప్ శ్రీను.. చేతిలో తాళి పట్టుకుని.. స్టేజీ మీదకు వస్తాడు. ఆ వెంటనే అక్కడ రెండు పీటలు వేసి.. ఇమ్ము-వర్షకు పెళ్లి చేసేందుకు రెడీ అవుతారు. ఇక ఇమ్మానుయేల్- వర్ష షాకయి చూస్తుండగా.. స్టేజీ మీద ఉన్న వారు.. వారిద్దరిని ఒకే చోటకు చేరుస్తారు. ఇక ఇమ్మానుయేల్.. వర్ష మెడలో తాళి కట్టేందుకు రెడీ అవుతుండగా.. పోసాని బాబు బాబు అని అరుస్తాడు.. రష్మీతో పాటు మిగతా వాళ్లంతా షాకయి చూస్తుండగా.. వర్ష ఇమ్మానుయేల్ మెడలో తాళి కట్టేందుకు ముందుకు వస్తాడు. మరి నిజంగానే కట్టాడా.. లేదా అన్నది తెలియకుండా ప్రోమో ఎండ్ అయ్యింది. మరి నిజంగానే ఇమ్మానుయేల్ వర్షకు తాళి కట్టాడా లేదా తెలియాలంటే.. ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు వేచి చూడాలి.
ఇక ప్రోమో చూసిన వారు మాత్రం.. పెళ్లిని ఎగతాళి చేయకండిరా.. ఇంకెన్నాళ్లు ఇలాంటి పనికి మాలిన ప్రోమోలు వదులుతారు.. కామెడీ చేయండి.. ఇలాంటి పనికిమాలిన వేషాలు కాదు.. అంటూ కామెంట్స్ చేస్తుండగా.. కొందరు మాత్రం నిజంగానే ఇమ్మానుయేల్ వర్షని లవ్ చేస్తున్నాడు.. చాలా నిజాయతీగా ఒప్పుకున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.