చిత్రపరిశ్రమలో ప్రసిద్ధ నవలలు, పుస్తకాల ఆధారంగా సినిమాలు రావడమనేది కొత్త కాదు. గతంలో ఎందరో మహనీయులు రాసిన నవలలను బేస్ చేసుకొని ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత మెల్లగా ఫిక్షనల్ స్టోరీస్, మాస్ మసాలా కథలను తెరపైకి తీసుకొచ్చారు. కమర్షియల్ గా రెండు దశాబ్దాలు ఫిక్షనల్ స్టోరీస్ హవా నడిచింది. కానీ.. కల్పిత కథలో కూడా సోల్ ఉంటే ఖచ్చితంగా సినిమాలు ఎక్కడికో వెళ్తాయి. అందులోనూ సామాజిక అంశాలను జోడించి తీస్తే.. సినిమాలకు తిరుగే లేదని ప్రూవ్ చేసిన దర్శకులలో శంకర్ ఒకరు. జెంటిల్ మెన్ నుండి రోబో 2.o వరకు ఏదొక సామాజిక అంశాన్ని చర్చిస్తూనే సినిమాలు తెరపై ప్రెజెంట్ చేశాడు శంకర్.
మొదటి సినిమా నుండే ముందుచూపుతో ఆలోచిస్తూ.. క్రియేటివ్ అనిపించుకున్న శంకర్.. కొంతకాలంగా బ్లాక్ బస్టర్ కోసం ట్రై చేస్తున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ తో RC15, కమల్ హాసన్ తో భారతీయుడు 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే.. రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నప్పటికీ, మరో భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే దర్శకుడు మణిరత్నం పొన్నియన్ సెల్వన్ మూవీతో హిట్ కొట్టాడు. ఆ సినిమా కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా తెరకెక్కింది. ఇప్పుడు శంకర్ కూడా మణిరత్నం బాటలోనే ఓ ప్రసిద్ధ నవల ‘వేల్పరి’ ఆధారంగా సినిమా చేయనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
వేల్పరి నవల కథ ఒక్క సినిమాలో చెప్పలేం అని.. ఏకంగా మూడు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారట. ఆ మూడు భాగాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా ముగ్గురు స్టార్ హీరోలతో రూపొందించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పటికే స్టార్ హీరోలు సూర్య, యశ్ లతో సంప్రదింపులు జరిగాయని.. ఇప్పుడీ కథలోకి మూడో హీరోగా బాలీవుడ్ స్టార్ రన్వీర్ సింగ్ ని తీసుకోనున్నట్లు సమాచారం. నిజానికి రన్వీర్ తో శంకర్.. అపరిచితుడు రీమేక్ చేయాలని అనుకున్నాడు. కానీ, వేల్పరి కథను మూడు భాగాలుగా అనుకునేసరికి.. రన్వీర్ కూడా ఈ కథలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి పొన్నియన్ సెల్వన్ మూవీని 2 భాగాలుగా ప్లాన్ చేస్తే.. ఇప్పుడు శంకర్ వేల్పరిని 3 భాగాలుగా చేయనున్నాడనే వార్త హాట్ టాపిక్ గా మారింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#MCExclusive: Director #Shankar‘s #Velpari adaptation,will be a Multi-Starrer. Dir Shankar is in talks with multiple stars for playing the characters from the novel akin to Ponniyin Selvan. Actors #RamCharan, #Yash, Ranver Singh and #Suriya‘s names are most buzzed in the circle! pic.twitter.com/Swpvk1Z5rL
— MovieCrow (@MovieCrow) November 8, 2022