వెండితెరపై కొన్ని ఊహించని కాంబినేషన్స్ అద్భుతాలు సృష్టిస్తుంటాయి. కొన్నిసార్లు సీనియర్ దర్శకులకంటే యువదర్శకులే డిఫరెంట్ సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంటారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీ దృష్టిని తమవైపు తిప్పుకున్న యువదర్శకులలో లోకేష్ కనగరాజ్ ఒకరు. డెబ్యూ మూవీతో మంచి హిట్ అందుకున్న లోకేష్.. ఆ తర్వాత కార్తీతో ఖైదీ, దళపతి విజయ్ తో మాస్టర్, కమల్ హాసన్ తో విక్రమ్ సినిమాలు తీసి అద్భుతమైన విజయాలు నమోదు చేశాడు. పూర్తిస్థాయి యాక్షన్ సినిమాలతో విపరీతమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న లోకేష్.. ప్రస్తుతం దళపతి విజయ్ తో మరో సినిమా చేస్తున్నాడు.
ఈ క్రమంలో లోకేష్ కనగరాజ్ తదుపరి సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీ వర్గాలలో బలంగా వినిపిస్తోంది. ఖైదీ, విక్రమ్ సినిమాలతో ‘లోకి సినిమాటిక్ యూనివర్స్’ క్రియేట్ చేసిన లోకేష్.. అందులోకి కార్తీ, కమల్ హాసన్ లతో పాటు రోలెక్స్ క్యారెక్టర్ ద్వారా హీరో సూర్యను పరిచయం చేసి మైండ్ బ్లాక్ చేశాడు. అలాగే నెక్స్ట్ ఖైదీ 2, విక్రమ్ 2 సీక్వెల్స్ ని రాబోతున్నాయని అనౌన్స్ చేసి సర్ప్రైజ్ చేశాడు. దీంతో ఎప్పుడెప్పుడు లోకేష్ నుండి ఖైదీ 2, విక్రమ్ 2 సినిమాలు వస్తాయా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అంతేగాక ఇప్పుడు తీస్తున్న దళపతి67 సినిమాతో విజయ్ ని కూడా తన యూనివర్స్ లోకి తీసుకురాబోతున్నాడని టాక్.
ఇదిలా ఉండగా.. లోకేష్ కనగరాజ్ ఆల్రెడీ తాను సినిమాలు చేసిన హీరోలందరితో బ్లాక్ బస్టర్స్ కొట్టి.. సూపర్ హిట్ కాంబినేషన్ అనిపించుకున్నాడు. కానీ.. తాజాగా కార్తీ, సూర్య, విజయ్ లను మించి పాన్ ఇండియా క్రేజ్ కలిగిన స్టార్ ని తన యూనివర్స్ లో ప్రెజెంట్ చేయబోతున్నాడని సమాచారం. ఇంతకీ ఆ స్టార్ ఎవరో అనుకుంటున్నారా? డార్లింగ్ ప్రభాస్. అవును.. లోకేష్ కనగరాజ్ దళపతి సినిమా తర్వాత ఖైదీ 2, విక్రమ్ 2 సినిమాలు చేస్తాడని తెలుసు. కానీ, ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ తో ఓ భారీ యాక్షన్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట. కోలీవుడ్ వర్గాల టాక్ ప్రకారం.. ప్రభాస్ ని కూడా ‘లోకి సినిమాటిక్ యూనివర్స్’లోకి లాగబోతున్నాడని అంటున్నారు.
ఇందులో నిజమెంత అనేది తెలియలేదు. కానీ.. లోకేష్ – ప్రభాస్ కాంబినేషన్ వినగానే ఫ్యాన్స్ లో పూనకాలు మొదలైపోయాయి. ఎందుకంటే.. లోకేష్ సినిమాలలో హీరోలకు సాలిడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ప్రభాస్ లాంటి కటౌట్ కి లోకేష్ డైరెక్షన్, టేకింగ్ కుదిరితే.. ఆ బొమ్మ తెరపై ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. మరి వినగానే గూస్ బంప్స్ తెప్పించిన ఈ కాంబినేషన్.. నిజంగానే సెట్ అవ్వాలని కోరుతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఇక ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్.. ఆదిపురుష్ ఫినిష్ చేసి.. సలార్, ప్రాజెక్ట్ కే, రాజా డీలక్స్ సినిమాలను కంప్లీట్ చేసే పనిలో బిజీ అయిపోయాడు. వీటి తర్వాత స్పిరిట్ చేయనున్నాడు. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేసి లోకేష్ కి అవకాశం ఇస్తాడేమో చూడాలి! మరి లోకేష్ – ప్రభాస్ క్రేజీ కాంబోపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి.
𝐄𝐗𝐂𝐋𝐔𝐒𝐈𝐕𝐄 𝐔𝐏𝐃𝐀𝐓𝐄 :- ✨
Director #LokeshKanagaraj Is Expected To Join Hands With Rebel Star #Prabhas For A High Budget Film. 🔥🔥
Hope Lokesh Will Start His Lokesh Cinematic Universe ( LCU ) Trend In Telugu Cinema Also. 👍#LokeshCinematicUniverse #LCU pic.twitter.com/LZ9Kj5krBT
— Roadside Ambanis (@RoadsideAmbanis) November 26, 2022
#Thalapathy67 will be part of “Lokesh Cinematic Universe” but I will not be a part of it. I will join hands with #LokeshKanagaraj in #Kaithi2 ❤️🔥
– Actor #Narain#ThalapathyVijay #LCU #Varisu— VCD (@VCDtweets) November 20, 2022