ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉండే బండ్ల గణేష్ ట్విట్టర్ లోకి వస్తే వేదాంతి, సిద్ధాంతి, తత్వవేత్త అయిపోతారు. యువతకు జీవిత సత్యాలు చెబుతూనే.. సెలబ్రిటీలకు కౌంటర్ ట్వీట్లు వేస్తుంటారు. తాజాగా బండ్ల గణేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది.
బండ్ల గణేష్ ఉన్నది ఉన్నట్టు ఖచ్చితంగా మాట్లాడతారు. ఈ మధ్య ట్విట్టర్ లో బాగా యాక్టివ్ గా ఉంటున్నారు. మంచైనా, చెడైనా తన ఆలోచనలను, భావాలను ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. అప్పుడప్పుడు వేదాంతిలా కూడా మారిపోతారు. యువతను కదిలించే ట్వీట్లు పెడుతూ తత్వవేత్తగా మారిపోయారు. జీవిత సత్యాలు బోధిస్తున్నారు. జీవితం ప్రశాంతంగా ముందుకు సాగాలంటే చాలా సందర్భాల్లో అన్నీ అర్థమైనా అర్థం కానట్లు ఉండాలని, ఎన్నో తెలిసినా ఏమీ తెలియనట్టు ఉండాలని, మనల్ని అవమానిస్తే దాన్ని ఆభరణంగా ఫీలవ్వాలని జీవిత సత్యాలు చెబుతున్నారు. అంతేనా డైరెక్టర్లను టార్గెట్ చేస్తూ కూడా ట్వీట్లు వదులుతుంటారు. తన ట్వీట్లతో ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అనే సలహాలు ఇస్తారు. తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ని టార్గెట్ చేశారేమో అని అనిపిస్తుంది.
‘మోసం చేయాలనుకునేవారు మేధావిలా నటిస్తాడు. వంచించాలనుకునేవాడు గురువులా నటిస్తాడు. కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ భక్తుడిగానే పొగరుగా ఉంటాడు. అది మీకు నచ్చినా నచ్చకపోయినా’’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో నెటిజన్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఉద్దేశించే ఈ ట్వీట్ చేశారన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య భీమ్లా నాయక్ సినిమా ఆడియో ఈవెంట్ కు బండ్ల గణేష్ ను పిలవలేదు. దీనికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాస్ అని వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్ గురించి బండ్ల గణేష్ వాయిస్ తో కూడిన ఆడియో కాల్ కూడా వైరల్ అయ్యింది. దీంతో త్రివిక్రమ్, బండ్ల గణేష్ ల మధ్య గ్యాప్ వచ్చిందన్న వార్తలు వచ్చాయి.
తాజా పరిణామాలు చూస్తే అదే నిజమన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇటీవలే త్రివిక్రమ్ శ్రీనివాస్ నే అన్నారేమో అని అనుమానం వచ్చేలా ఒక ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ కు సలహా ఇచ్చినట్టుగానే ఉందని నెటిజన్స్ అభిప్రాయపడ్డారు. ‘కాలం, పరిస్థితులు ఏ క్షణంలోనైనా తారుమారైపోతాయి. జీవితంలో ఎవర్నీ తగ్గించి మాట్లాడకూడదు. ఎవర్నీ బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తిమంతంగా ఉండొచ్చు. కానీ “కాలం” నీ కన్నా శక్తివంతమైనదని గుర్తుంచుకో. కాబట్టి మంచితనంతో ఉండాలి. మంచి మనసుతో ఆలోచించాలి. ప్రాణమిచ్చే వాడిని పోగొట్టుకోకు. అవసరం కోసం ఆడుకునే వాళ్ళని, వాడుకునే వాళ్ళని అంటిపెట్టుకోకు. జీవితం మళ్ళీ మళ్ళీ రాదు. ఒకేసారి వస్తుంది. దానిని అద్భుతంగా వాడుకో’ అంటూ ఫిబ్రవరి 10న ట్వీట్ చేశారు.
దీంతో నెటిజన్లు.. ఇది ఖచ్చితంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఉద్దేశించే ట్వీట్ చేశారని అభిప్రాయపడ్డారు. తాజాగా మరో ట్వీట్ చేయడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ నే అని నిర్ధారించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ని గురువు అని సంబోధిస్తారు. బండ్ల గణేష్ పవన్ భక్తుడు అని చెప్పుకుంటారు. ఆయన పెట్టిన ట్వీట్ ప్రకారం చూస్తే.. పవన్ భక్తుడిగా పవన్ గురువు అయిన త్రివిక్రమ్ ని టార్గెట్ చేసినట్టుగానే కనిపిస్తుందని నెటిజన్స్ అంటున్నారు. మరి నిజంగానే బండ్ల గణేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ని టార్గెట్ చేశారా? లేక వేరే కారణం ఏదైనా ఉందా? అనేది తెలియదు గానీ ప్రస్తుతం బండ్ల గణేష్ ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బండ్ల గణేష్ ట్వీట్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
మోసం చేయాలనుకునే వాడు మేధావిలా నటిస్తాడు.. వంచించాలనుకునేవాడు గురువులా నటిస్తాడు.. కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడు భక్తుడు గానే పొగరుగా ఉంటాడు.
అది మీకు నచ్చినా నచ్చకపోయినా..🔥— BANDLA GANESH. (@ganeshbandla) February 16, 2023