సినిమాలు చేసే విషయంలో కుర్ర హీరోలతో పోటీ పడుతుంటారు నటసింహం నందమూరి బాలకృష్ణ. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తుంటాడు బాలయ్య. ఇక 2021లో వచ్చిన అఖండ చిత్రం బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమా సాధించిన విజయంతో వరుస చిత్రాలు పట్టాలెక్కించాడు బాలయ్య. ప్రస్తుతం ఎన్‌బీకే 107 షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. గోపిచందర్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య పక్కా మాస్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇదేకాక దర్శకుడి అనిల్ రావిపూడితో ఓ చిత్రాన్ని చేయబోతున్నట్లు ప్రకటించాడు బాలయ్య. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది.
అదేంటంటే బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నాలుగు దశాబ్దాలకు పైనే అవుతోంది. ఇప్పటి వరకు ఆయన కేవలం తెలుగులో మాత్రమే సినిమాలు చేశారు. అయితే ప్రస్తుతం బాలయ్య ప్రయోగాలకు పెద్ద పీట వేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలిసారి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రం ద్వారా బాలయ్య బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ చిత్రం దక్షిణాది అన్ని భాషల్లోనూ రూపొందనుందని.. అలానే దీన్ని బాలీవుడ్‌లో కూడా విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో.. సినిమా విడదల వేళ తెలుస్తోంది
ఇక దర్శకుడు అనిల్ రావిపూడి.. తెలుగులో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికే మహేష్ బాబు వంటి స్టార్ హీరోతో సరిలేరు నీకెవ్వరు సినిమా తీసి.. బ్లాక్‌బాస్టర్ హిట్ కొట్టాడు. ఈ నేపథ్యంలో ఆయన బాలయ్యతో సినిమా అనౌస్స్ చేయడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక వీరద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కే ఈ చిత్రాన్ని.. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో అంజలి, ప్రియమణి కీలక పాత్రలను నటిస్తున్నారని.. అలానే యంగ్ బ్యూటీ శ్రీలీలా.. బాలయ్య కూతురిగా నటించబోతుంది అని ఇప్పటికే బోలేడు వార్తలు వచ్చాయి.
ఇక అనిల్ రావిపూడి సినిమాలంటే.. ప్రధానంగా కామెడీకి పెద్ద పీట వేస్తాడు. అయితే బాలకృష్ణతో చేయబోయే సినిమా కోసం.. ఈ కుర్ర దర్శకుడు తొలిసారి కామెడీకి ప్రాధాన్యత తగ్గించి ఓ పవర్‌ఫుల్ సబ్జెక్టును రెడీ చేస్తున్నట్లు తెలిసింది. మరి ఈ సినిమాలో బాలకృష్ణ బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఎదురు చూడాలి.