గతేడాది ‘సర్కారు వారి పాట’ మూవీతో మంచి హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. తదుపరి సినిమాలను సాలిడ్ గా లైనప్ చేశాడు. అతడు, ఖలేజా సినిమాలతో ఘట్టమనేని ఫ్యాన్స్ కి మర్చిపోలేని ఆల్ టైమ్ ఎంటర్టైనింగ్ మూవీస్ అందించిన త్రివిక్రమ్ తో ఓ సినిమా.. ఆ తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళితో బిగ్గెస్ట్ ఫ్రాంచైస్ ప్లాన్ చేసేశాడు. ఇటీవలే రాజమౌళితో సినిమా ఫ్రాంచైస్ అని చెప్పి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు రచయిత విజయేంద్రప్రసాద్. కాగా.. రాజమౌళితో మహేష్ మూవీ త్రివిక్రమ్ మూవీ తర్వాతే ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం మహేష్ – త్రివిక్రమ్ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహేష్ – త్రివిక్రమ్ సినిమా అంటే అంచనాలు పీక్స్ లో ఉంటాయి. ఎందుకంటే.. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పాత సినిమాల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ, ప్రెజెంట్ వీరున్న బ్లాక్ బస్టర్స్ ఫామ్ చూస్తే ఖచ్చితంగా హైప్ భారీ స్థాయిలో నెలకొంది. ఇక ఇప్పుడు వీరి కాంబోలో రాబోయే మూవీ మూడోది. కాగా.. ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది. సినిమాకి తమన్ సంగీతం అందించనున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు సినిమాని నిర్మించనున్నారు. ఇలాంటి తరుణంలో ఇప్పటికే సినిమాలో స్పెషల్ క్యారెక్టర్స్ లో సీనియర్ హీరోయిన్స్ కనిపించనున్నారని టాక్ ఉంది.
ఇదిలా ఉండగా.. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఓ కీలకపాత్ర కోసం ఏకంగా అల్లు అర్జున్ కూతురే నటించనుందట. అవును.. తాజా సినీవర్గాల సమాచారం ప్రకారం.. సినిమాలో ఓ కీలకపాత్రలో అల్లు అర్జున్ కూతురు అర్హ కనిపించనుందని టాక్. అర్హ ఆల్రెడీ శాకుంతలం మూవీలో నటించింది. పైగా సోషల్ మీడియాలో అయినా, బయట అయినా అర్హ చేసే అల్లరి మామూలుగా ఉండదు. మరి అర్హ నిజంగా మహేష్ సినిమాలో నటించనుందా అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఇక మహేష్ – త్రివిక్రమ్ మూవీపై మీ అంచనాలు ఎలా ఉన్నాయో కామెంట్స్ లో తెలియజేయండి.
SuperStar @urstrulyMahesh & Celluloid #Trivikram‘s HATTRICK combination #SSMB28 @haarikahassine pic.twitter.com/DJl0OSYmjY
— Thyview (@Thyview) January 1, 2023