ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు సౌత్ హీరోలు, నార్త్ హీరోలు అనే తేడాలు ఏమి లేవని చెప్పాలి. ఎందుకంటే.. సినిమాలో దమ్ముంటే ఏ హీరో సినిమాలైనా, ఎక్కడైనా ఆడతాయి అనేది ప్రూవ్ అవుతూ వస్తోంది. పాన్ ఇండియా స్టార్స్ గా ఎదిగిన ప్రభాస్, అల్లు అర్జున్, యష్ ల దగ్గరనుండి బాలీవుడ్ స్టార్స్ సల్మాన్, షారుఖ్, ఆమిర్, రణబీర్ లతో పాటు అందరి సినిమాలకు ఇప్పుడు భాషాంతరాలు ఏమీలేవు. ఎవరి సినిమా ఎక్కడైనా రిలీజ్ చేసుకోవచ్చు.. కానీ, సినిమాలో హీరో కన్నా కంటెంట్ ముఖ్యమని అంటున్నారు ప్రేక్షకులు. తాజాగా కార్తికేయ, విక్రాంత్ రోణ, విక్రమ్ సినిమాలు కూడా ప్రూవ్ చేశాయి.
ఇక బాక్సాఫీస్ వద్ద సినిమాల కలెక్షన్స్ మాత్రమే కాదు.. హీరోల రెమ్యూనరేషన్స్ కూడా చాలా ఇంటరెస్టింగ్ ఉంటాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో 1 కోటి నుండి 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలు ఉన్నారు. అయితే.. తాజాగా ఈ జాబితాలోకి అల్లు అర్జున్ చేరబోతున్నట్లు టాక్. పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీ.. తన యాటిట్యూడ్, యాక్టింగ్, మాస్ లుక్ తో అందరినీ మెప్పించాడు. సౌత్ తో పాటు నార్త్ లో కూడా 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాడు. మొత్తంగా పుష్పతో 300 కోట్లు క్లబ్ లో చేరిన బన్నీ.. పుష్ప 2 సినిమాకి ఇండియన్ హిస్టరీలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకోనున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటివరకు ఇండస్ట్రీలో రూ. 125 కోట్లు రెమ్యూనరేషన్ ఒకే మూవీకి తీసుకున్న హీరో సల్మాన్ ఖాన్. కాగా ఇప్పుడు రూ. 125 కోట్లు తీసుకోబోతున్న రెండో హీరో బన్నీనే అంటూ ప్రముఖ మీడియా సంస్థ ‘ఆజ్ తక్’ ఇటీవలి కథనాలతో తెలిపింది. అయితే.. ఒకవేళ ఇదే నిజమైతే 125 కోట్ల హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకున్న మొదటి సౌత్ హీరోగా బన్నీ అవతరించనున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం.. మైత్రి మూవీస్ వారు పుష్ప 2ని దాదాపు రూ. 450 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారట. సుకుమార్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ కాగా, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. మరి పుష్ప 2 కోసం బన్నీ రెమ్యూనరేషన్ పై వస్తున్న వార్తల పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.