సౌత్ ఇండియన్ స్టార్ హీరోలలో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కెరీర్ పరంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న ఎన్టీఆర్.. తదుపరి సినిమాను దర్శకుడు కొరటాల శివతో చేయబోతున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి.. ట్రిపుల్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ ని పాన్ ఇండియా స్టార్ చేశాడు. అయితే.. ఎన్టీఆర్ పాన్ ఇండియా క్రేజును కంటిన్యూ అయ్యే విధంగా కొరటాల స్క్రిప్ట్ రెడీ చేశాడని తెలుస్తుంది.
ఈ క్రమంలో కొరటాల – ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఖరారు అయినట్లు వార్తలు వినిపించాయి. ఈ విషయంపై చిత్రబృందమైతే క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఎన్టీఆర్ జోడిగా అలియా అని ఫ్యాన్స్ మాత్రం ఫిక్స్ అయిపోయారు. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 20 తర్వాత ప్రారంభించనున్నారని టాక్ వినిపించింది. కానీ ప్రస్తుతం మూవీ నుండి ఎన్టీఆర్ కి జోడిగా అలియా తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అందుకు కారణం కూడా లేకపోలేదు. అలియా భట్ ఈ వారంలోనే బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ని పెళ్లి చేసుకోబోతుంది. ఏప్రిల్ 17న అలియా – రణబీర్ పెళ్లి బంధంలో అడుగు పెట్టనున్నారని, అదికూడా అతి తక్కువమంది సన్నిహితుల మధ్య వీరి పెళ్లి జరగనుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. అలియా పెళ్లి చేసుకుంటుంది కాబట్టి.. దాదాపు నెల రోజులపాటు సినిమా షూటింగ్స్ లో పాల్గొనే అవకాశం లేదని సమాచారం.
ఈ క్రమంలో ఏప్రిల్ చివరి వారంలో మొదలు కావాల్సిన ఎన్టీఆర్ – కొరటాల మూవీ షూటింగ్ కి తాను అందుబాటులో ఉండలేననే కారణంచేత అలియా ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని సినీవర్గాలలో టాక్ నడుస్తుంది. అయితే.. ఎన్టీఆర్ సరసన జోడిగా మరో బాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేయనున్నారని ఇండస్ట్రీ టాక్. అదీగాక ఇప్పటివరకు ఎన్టీఆర్ కి జోడిగా అలియా ఫిక్స్ అయ్యిందనే విషయాన్ని దర్శకనిర్మాతలు అధికారికంగా ప్రకటించలేదు. కనుక ఇప్పుడు అలియా తప్పుకున్నా ప్రాబ్లెమ్ లేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ కోసం కొరటాల ఏ బ్యూటీని ఫైనల్ చేస్తాడో చూడాలి. మరి ఎన్టీఆర్ – కొరటాల మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.