కస్తూరి శంకర్.. ఒక మోడల్ గా, నటిగా తనని తాను నిరూపించుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ఇండస్ట్రీల్లో చాలా సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో లీడ్ రోల్ లో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో సినిమాల పరంగా సంపాదించుకున్నా ప్రేక్షకాదరణ కంటే.. గృహలక్ష్మి సీరియల్ తోనే తనకు ఆదరణ లభిస్తున్నట్లు కస్తూరి సైతం అభిప్రాయపడ్డారు. ఒక నటిగానే కాకుండా సోషల్ యాక్టివిస్టుగా కూడా కస్తూరి శంకర్ పని చేస్తుంటారు. సమాజంలో జరుగుతున్న ఎన్నో విషయాలు, వివాదాలపై తన గళం వినిపిస్తూ ఉంటారు.
అటు సోషల్ మీడియాలోనూ కస్తూరి శంకర్ ఎంతో యాక్టివ్ గా ఉంటారు. తన డైలీ యాక్టివిటీస్, ఫొటో షూట్స్ మొత్తం సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా సండే స్పెషల్ అంటూ చేసిన ఫొటో షూట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. స్వతహాగా కస్తూరి ఒక మోడల్ అని అందరికీ తెలుసు. బ్లాక్ శారీలో ఉన్న ఆవిడ ఫొటోలు కాస్త బోల్డ్ గా ఉన్నాయనే చెప్పాలి. ఇంక సీరియల్ విషయానికి వస్తే.. ఇంటింటి గృహలక్ష్మీ ఇటీవలే 600 డేస్ పూర్తి చేసుకుని ఇంకా స్ట్రాంగ్ గా ముందుకెళ్తోంది అంటూ సెలబ్రేట్ చేస్తుకున్నారు. ప్రస్తుతం కస్తూరి శంకర్ బోల్డ్ ఫొటో షూట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కస్తూరి శంకర్ ఫొటో షూట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.