దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం RRR. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మూవీపై అంచనాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, హీరోయిన్ అలియా భట్ నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు పెరుగుతున్నాయి.
ఇక బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజమౌళి ఈ చిత్రాన్ని చారీత్రక నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. ఇక తాజాగా RRR మూవీ యూనిట్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. 2018 నవంబర్ 19న ఏ బైక్‌తో నైతే షూటింగ్‌ను ప్రారంభించామో అదే బైక్‌తో షూటింగ్‌ను కంప్లిట్ చేశామని చిత్ర యూనిట్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా తెలపటంతో సినీ అభిమానులు పండగా చేసుకుంటున్నారు. కాగా ఇప్పటికే విడుదలైన ఈ మూవీ దోస్తీ సాంగ్‌ను నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. దీంతో షూటింగ్ కూడా పూర్తవ్వటంతో ఈ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేసేందుకు మూవీ యూనిట్ అంతా సిద్దం చేస్తోంది.
TIGER and CHEETAH…🐅🐆
Leaving the set after wrapping up their last shot for the movie today!#RRRMovie @tarak9999 @alwaysramcharan pic.twitter.com/ttpthr8ifn— RRR Movie (@RRRMovie) August 26, 2021