సినిమా ఇండస్ట్రీలో రాణించాలని చాలా మంది కలలు కంటారు. కానీ కొందరికి మాత్రమే ఆ అవకాశాలు లభిస్తాయి. అవకాశాలు వచ్చినా అదృష్టం లేకపోతే.. రాణించలేం. ఈ కోవకు చెందిన వ్యక్తే సంపంగి హీరో. అతడి కెరీర్ వివరాలు..
సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల లోకం. కష్టపడి పని చేస్తే విజయం వరిస్తుంది అంటారు. కానీ సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే మాత్రం కష్టంతో పాటు కాస్తంత అదృష్టం కూడా తోడవ్వాలి. లేదంటే ఇండస్ట్రీలో రాణించాలనే కలలు కల్లలుగానే మిగులుతాయి. అన్ని అనుకూలించి అవకాశాలు వచ్చినా సరే.. సరైన హిట్ దక్కక.. ఏళ్ల తరబడి ఒడిదుడుకులు ఎదుర్కొనే వారు ఎందరో ఉన్నారు. అందం, టాలెంట్ అన్ని ఉన్నా సరే.. సరైన అవకాశాలు లేక.. అరకొర పాత్రల్లో నటించడం ఇష్టం లేక.. ఇండస్ట్రీకి దూరం కాలేక ఇబ్బంది పడుతున్నవారు మన ఇండస్ట్రీలో కోకొల్లలు. ఈ కోవకు చెందిన వ్యక్తే దీపక్ బజ్వా. సంపంగి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందమైన రూపం, మంచి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సినిమా కూడా భారీ విజయం సాధించడంతో.. ఇక దీపక్ టాలీవుడ్‌లో స్టార్ హీరో అవుతాడని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు.. కారణం..
సంపంగి సినిమా యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. ముస్లిం అమ్మాయి, హిందూ అబ్బాయి మధ్య ప్రేమ, దానికి తగ్గట్టుగా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తెర కెక్కించిన ఈ చిత్రం.. యూత్‌ని మాత్రమే కాక.. ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా విపరీతంగా నచ్చింది. పాటలు ఓ రేంజ్‌లో హిట్ అయ్యాయి. సనా యాదిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు దీపక్ బజ్వా. అతడి స్వస్థలం ఢిల్లీ. అసలు పేరు అర్జన్ బజ్వా. సినిమాల్లోకి రాకముందు మోడల్‌గా చేశాడు. స్టార్ హీరోలతో కలిసి అనేక యాడ్స్‌లో నటించాడు. సంపంగి సినిమా మంచి విజయం సాధించడంతో.. ఇక అతడి కెరీర్ దూసుకుపోతుందని అందరూ భావించారు.
అనుకున్నట్లుగానే సంపంగి సినిమా తర్వాత.. దీపక్‌కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. నీ తోడు కావాలి, ప్రేమలో పావని కళ్యాణ్, కనులు మూసినా నీవాయే వంటి చిత్రాల్లో హీరోగా నటించాడు. సంపంగి సినిమాతో వచ్చిన క్రేజ్‌ను నిలుపుకోవడంలో దీపక్ తడబడ్డాడు. ఆ తర్వాత వరుస అవకాశాలు రావడంతో.. సినిమాల ఎంపికలో కొన్ని తప్పటడుగులు వేశాడు. దాంతో సంపంగి తర్వాత చేసిన సినిమాల్లో కొన్ని మాత్రమే హిట్ అయ్యాయి. చాలా సినిమాలు ప్లాఫ్ అయ్యాయి. దాంతో నెమ్మదిగా అవకాశాలు తగ్గాయి. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి.. భద్ర, అరుంధతి, మిత్రుడు, కింగ్ వంటి సినిమాల్లో నటించాడు. కానీ అవేవి అతడికి ఆశించిన గుర్తింపు ఇవ్వలేదు.
ఇక టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడంతో.. బాలీవుడ్‌కి వెళ్లాడు దీపక్. అక్కడ గురు, ఫ్యాషన్ వంటి చిత్రాల్లో నటించి.. మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రసుత్తం బాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం దళపతి విజయ్ హీరోగా వచ్చిన బిగిల్ చిత్రంలో కనిపించాడు దీపక్. ప్రస్తుతం పలు బాలీవుడ్ చిత్రాలతో పాటు.. వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నాడు. సంపంగి సినిమా తర్వాత.. దీపక్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. వరుస అవకాశాలు వచ్చాయి. కానీ సరైన కథలు ఎంచుకోవడంలో తడబడ్డాడు. ఫలితంగా టాలీవుడ్‌లో టాప్ హీరో కావాల్సిన వాడు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, బాలీవుడ్‌లో సైడ్ క్యారెక్టర్ పాత్రలు పోషిస్తున్నాడు. తన కెరీర్ పట్ల దీపక్ బజ్వా సంతోషంగా ఉన్నప్పటికి.. అతడి అభిమానులు మాత్రం కాస్త.. అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు.