టాక్ షోలకే బాప్ షోగా నిలిచింది అన్‌స్టాపబుల్. నందమూరి బాలకృష్ణ.. యాంకర్‌గా చేస్తున్న ఈ షో ఫస్ట్ సీజన్.. విపరీతమైన క్రేజ్, ఆదరణ సంపాదించుకుంది. తొలి సీజన్ సాధించిన భారీ విజయంతో.. తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 2ని ప్రారంభించారు. సీజన్ 2 మొదటి ఎపిసోడ్ సంచలనాలకు తెర తీసింది. ఎందుకంటే.. ఈ తొలి ఎపిసోడ్‌కు.. గెస్ట్‌గా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లు హాజరయ్యారు. అసలు ఈ ఎపిసోడ్ సాధించిన రికార్డులు అన్ని ఇన్ని కావు. ప్రోమో, ఎపిసోడ్.. తెగ వైలయ్యాయి. ఈ క్రమంలో సీజన్ 2లో మరో మోస్ట్ వాంటెడ్ గెస్ట్ రాబోతున్నాడు. ఆయనే డార్లింగ్ ప్రభాస్. డార్లింగ్ ప్రభాస్.. బాలకృష్ణ వ్యాఖ్యతగా చేస్తోన్న అన్‌స్టాసబుల్ 2 కి గెస్ట్‌గా రాబోతున్నారు.
ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియో లీక్ అవ్వడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ప్రభాస్ డ్రెస్సింగ్ స్టైల్‌పై బాలయ్య పంచులు వేయడం.. అలానే ఈ షోకి ప్రభాస్ వేసుకొచ్చిన షర్ట్ కాస్ట్ వంటి వివరాలు.. వైరలవుతున్న సంగతి తెలిసింది. ఇక ఈ ఎపిసోడ్‌లో.. ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావన వచ్చిందట. ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాక.. ఇండియా వ్యాప్తంగా.. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ హీరో ఎవరు అంటే.. ప్రభాస్ పేరు ముందుగా వినిపిస్తుంది. ఇక కొన్ని రోజుల క్రితం వరకు ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతీ సనన్ ప్రేమలో ఉన్నారంటూ జోరుగా వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే ఇవన్ని.. ఒట్టి పుకార్లని.. స్వయంగా కృతీ సనన్ స్పష్టం చేసింది.
ఈ క్రమంలో బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి ప్రభాస్.. గెస్ట్‌గా రాబోతున్నాడు.. అనే వార్త తెలియగానే.. చాలా మంది నెటిజనులు.. ప్రభాస్ పెళ్లి గురించి కూడా అడగండి సార్ అంటూ కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. షోలో భాగంగా.. ప్రభాస్ పెళ్లి ప్రస్తావన వచ్చిందంట. ఈ షోకి ప్రభాస్, గోపిచంద్ ఇద్దరు గెస్ట్‌లుగా రానున్నట్లు ఇప్పటికే తెలిసింది. ఈ క్రమంలో బాలయ్య.. డార్లింగ్ పెళ్లి ప్రస్తావన తెచ్చి.. ఇంతకు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అని ప్రశ్నించారట. అప్పుడు ప్రభాస్.. ఎప్పటిలానే ఏదో చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారట. ఆ సమయంలో గోపీచంద్, ఫోన్ ఇన్‌లో అందుబాటులోకి వచ్చిన మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ మాత్రం.. కొత్త సమాధానం చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
మరో రెండు నెలల్లో.. ప్రభాస్ మరో రెండు నెలల్లో పెళ్లి చేసుకోనున్నారని రామ్‌చరణ్.. బాలయ్యతో సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. అలానే గోపీచంద్ కూడా.. వచ్చే ఏడాది ప్రభాస్ తప్పకుండా పెళ్లి చేసుకుంటాడని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వార్త మాత్రం.. ఇటు డార్లింగ్ ఫ్యాన్స్‌కు.. అటు రెబల్ స్టార్ అభిమానులకు సంతోషాన్ని ఇచ్చేదని చెప్పాలి. ఇప్పటికే ప్రభాస్ పెళ్లి గురించి అనేక సార్లు.. ఎన్నో వార్తలు, పుకార్లు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక ప్రభాస్, గోపీచంద్ అతిథులుగా వచ్చిన ఎపిసోడ్ గ్లింప్స్‌ని తాజాగా ‘ఆహా’ విడుదల చేసింది. ‘ఇది చిన్న గ్లింప్స్ మాత్రమే. మెయిన్ ప్రోమో తర్వాత’ అని ఆహా పేర్కొంది. ఈ గ్లింప్స్‌లో ‘రేయ్… ఏం చెబుతున్నావ్ డార్లింగ్!’ అని ప్రభాస్ అనడం హైలైట్. బహుశా.. పెళ్లి గురించి రామ్ చరణ్, గోపీచంద్ ఏమైనా చెప్పినప్పుడు.. ప్రభాస్ ఇలా అని ఉంటాడేమో అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి త్వరలోనే ఈ విషయం క్లారిటీ రానుంది. ఇక నూతన సంవత్సరం సందర్భంగా ఈ ఎపిసోడ్‌ని ప్రసారం చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.