ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల జోరు కొనసాగుతోంది. ఇటీవలే ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇక కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’. ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ కేజీఎఫ్ 2 ట్రైలర్ మాసివ్ రెస్పాన్స్ దక్కించుకొని అంచనాలను రెట్టింపు చేసింది.
ఇక కేజీఎఫ్ కి ముందురోజు(ఏప్రిల్ 13న) తమిళ స్టార్ దళపతి విజయ్ నటించిన ‘బీస్ట్’ సినిమాను రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుండటం విశేషం. నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పై కూడా ఫ్యాన్స్ లో అంచనాలు భారీగానే నెలకొన్నాయి. అయితే.. కేజీఎఫ్ 2 కి పోటీగా బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ నటించిన ‘జెర్సీ’ మూవీ రాబోతుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేజీఎఫ్ ఫీవర్ ఊహించలేని స్థాయిలో ఉంది. అటు దళపతి విజయ్ బీస్ట్ చూస్తే కోలీవుడ్ లో తప్ప ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. ఇక జెర్సీ.. బాలీవుడ్ వరకే రిలీజ్ కానుంది. అయితే.. సౌత్ ఇండస్ట్రీలో యష్ – విజయ్ ల మధ్య వాతావరణం కాస్త పోటీని తలపిస్తోంది. కానీ ఈ రెండు కూడా డిఫరెంట్ జానర్లలో తెరకెక్కాయి. బీస్ట్ యాక్షన్ థ్రిల్లర్ కాగా, కేజీఎఫ్ మాఫియా బాసిల్ డ్రాప్ లో రూపొందింది.
ఈ రెండూ కాకుండా షాహిద్ కపూర్ ‘జెర్సీ’.. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కింది. కాబట్టి ఈ మూడు సినిమాల క్రేజ్ దేనికదే అయినప్పటికీ.. సాధారణంగా ప్రేక్షకులు కోరుకునే మాసివ్ అంశాలు మాత్రం కేజీఎఫ్ 2లోనే ఉన్నాయంటున్నారు ప్రేక్షకులు. 2018లో వచ్చిన కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ గా రానుండటంతో అందరి దృష్టి ఈ సినిమాపైనే పడిందని చెప్పాలి.
బాక్సాఫీస్ విషయంలో కేజీఎఫ్ 2 మూవీకి అటు తమిళనాడులో కాస్త మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే.. తమిళనాడులో దళపతి బీస్ట్ హవా నడుస్తోంది. కాబట్టి అక్కడి సినిమాను బీట్ చేయాలంటే డబ్బింగ్ సినిమా అయి ఉండకూడదు. డైరెక్ట్ తమిళ సినిమా కాకపోవడం కేజీఎఫ్ 2కి మైనస్ గానే చెప్పాలి. కానీ బీస్ట్ సినిమాకి మాత్రం తమిళంలో తప్ప వేరే భాషల్లో పెద్దగా టాక్ లేదు.
విజయ్ కి తమిళం తర్వాత మోస్తరు క్రేజ్ ఉందంటే అది తెలుగులోనే.. కానీ తెలుగు ప్రేక్షకులు కూడా కేజీఎఫ్ 2 కోసమే వెయిట్ చేస్తున్నారు. ఈ లెక్కన కేజీఎఫ్ 2కి ఏది పోటీగా వచ్చినా ఫ్యాన్స్ చూసే ఆలోచనలో లేరేమోనని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఈ రెండే అనుకుంటే.. కేజీఎఫ్ కి పోటీగా జెర్సీ వస్తోంది. కానీ అది ఒక డబ్బింగ్ సినిమా. కాబట్టి కేజీఎఫ్ 2కి జెర్సీ ఏమాత్రం పోటీ కాదని అంటున్నాయి సినీవర్గాలు.
#KGFChapter2 vs #beast #raw #रॉ
Muze nahi lagta because kashmir files still running, RRR still running , attack April 1 , beast April 13, jersey April 14 & kgf 2 April 14 🙆 kitni movies hai
Pata nahi screens bhi dhang se milegi ya nahi
Me toh bass kgf 2 aur beast hi dekhu ga pic.twitter.com/qKRrpLTKda— T-Vijay&A-Arjun(GUJARAT) (@jaykumardeshmu3) March 28, 2022
అందులోను కేజీఎఫ్ కి హిందీలో మార్కెట్ భారీ స్థాయిలో ఉంది. ట్రైలర్, టీజర్లకు వచ్చిన స్పందన చూస్తేనే అర్థమవుతుంది బాలీవుడ్ ఫ్యాన్స్ సైతం రాకీ భాయ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తుఫాన్ సాంగ్ లాగే.. ట్రైలర్ కూడా బాక్సాఫీస్ లో కలెక్షన్స్ తుఫాన్ క్రియేట్ చేస్తుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక కేజీఎఫ్ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా.. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ సినిమాను నిర్మించారు. మరి కేజీఎఫ్ 2 – బీస్ట్ – జెర్సీ బాక్సాఫీస్ వార్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.