బుల్లితెర యాంకర్‌గా పరిచయమై.. వెండితెరపై అలరిస్తోన్న అనసూయ భరద్వాజ్ అందరకి సుపరిచితమే. వరుస సినిమాలతో బిజీ జీవితం గడుపుతున్న అనసూయ.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫీలింగ్స్ తెలియజేస్తుంటుంది. సినిమా షూటింగులకెళ్లినా, విహారయాత్రలకెళ్ళినా.. తన ప్రతి ఫీలింగ్‌ని, మూమెంట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్ల కామెంట్లను, కాంట్రవర్సీ పోస్ట్‌లను చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలో అనసూయ.. తన భర్త పక్కన లేనప్పుడు.. తన పరిస్థితి ఎలా ఉంటుందో అన్నట్లుగా వీడియో షేర్ చేసింది. బెడ్ రూమ్ లో బెడ్ పై పడుకొని ఉన్న అనసూయ.. భర్త పక్కన లేనందుకు తెగ భాదపడిపోయింది.
అనసూయకు భర్త భరద్వాజ్ అంటే వల్లమాలిన ప్రేమ. వీరిద్దరిది ప్రేమ పెళ్లండోయ్. అందుకేనేమో.. ఆయన మీద అమితమైన ప్రేమ. ప్రస్తుతం అనసూయ షూటింగ్ పనుల్లో వేరే ఊరు వెళ్లినట్లుంది. ఈ క్రమంలో తన ఒంటరి తనాన్ని ఫ్యాన్స్ కి వీడియో రూపంలో తెలియజేసింది. బెడ్ పై పడుకున్న అనుసూయ పక్కనే ఖాళీగాపోస్ట్ పెట్టింది. ఇలాంటి విషయాలు పబ్లిక్ గా చెప్పడం కరెక్ట్ కాకున్నా.. భర్త తోడు లేకుంటే ఒంటరిగా ఫీలవుతున్నందుకు ఆమెను మెచ్చుకోవాల్సిందే.
ఇక అనసూయ కెరీర్ మూడు పువ్వులు.. ఆరు కాయలన్నట్లుగా వికసిస్తోంది. ఒకవైపు బుల్లితెర.. మరోవైపు వెండితెర.. రెండింటిని చక్కగా బ్యాలన్స్ చేస్తోంది. ఇక అనసూయ హీరోయిన్ గా నటించిన దర్జా, వాంటెడ్ పండుగాడు చిత్రాలు ఇటీవల విడుదలయ్యాయి. ఇవి రెండు అనుకున్న విజయాన్ని అందుకోలేదు. ప్రస్తుతం ఆమె రంగమార్తాండ, పుష్ప 2 చిత్రాల్లో నటిస్తున్నారు. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో ‘దేవదాసి’ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పుష్ప 2 త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా పుష్ప పార్ట్ -1లో దాక్షాయణిగా అనసూయ అలరించిన సంగతి తెలిసిందే.