పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అతనంటే పడి చచ్చిపోయే అమ్మాయిలూ ఉన్నారు. ఇక ప్రభాస్ కూడా అభిమానులపై ప్రేమ చూపిస్తా
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అతనంటే పడి చచ్చిపోయే అమ్మాయిలూ ఉన్నారు. ఇక ప్రభాస్ కూడా అభిమానులపై ప్రేమ చూపిస్తారు. తన సినిమా వేడుకలకు వచ్చినప్పుడు ఫ్యాన్స్‌తో ‘హాయ్ డార్లింగ్స్’ అంటూ సరదాగా మాట్లాడుతారు. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అంటూ తగు జాగ్రత్తలు చెప్తారు. ఇక.. తెలుగులో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోస్‌లో ముందు వరుసలో ఉంటారు డార్లింగ్ ప్రభాస్. అయితే.. కొందరు నటీనటులు తమ ఇష్టమైన హీరోల గురించి అనేక రకాలుగా స్పందిస్తూ ఉంటారు. కొందరు పాజిటివ్‌గా మాట్లాడితే, మరి కొందరు నెగిటివ్‌గా మాట్లాడుతారు. తాజాగా ఓ నటి ప్రభాస్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
ప్రభాస్‌తో నటించాలాని ఎంతో మంది నటీనటులు కోరుకుంటారు. అతని పక్కన ఒక చిన్న క్యారెక్టర్ చేసినా చాలు అనుకునే వారు లేకపోలేదు. అందులోనూ లేడీ ఆర్టిస్ట్ లు అయితే మరీనూ. అయితే.. తాజాగా ఓ నటి ప్రభాస్ మీద వివాదాస్పద రీతిలో స్పందించింది. బుట్ట బొమ్మ, కొరమీను, రాజ రాజ చోళ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఇందు కుసుమ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా ప్రభాస్ పై బోల్డ్ కామెంట్స్ చేసింది. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మీరు ఎవరితో వర్క్ చేయడం ఇష్టపడతారు, మీ ఫేవరెట్ పర్సన్ ఎవరు అని యాంకర్ ప్రశ్నించగా.. ఆమె బోల్డ్‌గా బదులిచ్చింది. “ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం, అతనికి చెల్లిగా నటించే అవకాశం వస్తే చేస్తాను. ఆఫ్ స్క్రీన్ మాత్రం ఐ విల్ రేప్ యూ” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఎంత అభిమానం ఉన్నా మరీ బోల్డ్‌గా మాట్లాడటం కరెక్ట్ కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్నారు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న మూవీ సలార్. బాహుబలి, కేజీఎఫ్ తరహాలోనే ఈ మూవీ కూడా రెండు పార్ట్‌లుగా తెరకెక్కబోతుంది. దీంతో పాటు మరో పాన్ ఇండియా సినిమా ‘కల్కి 2898 AD’ ఉండనే ఉంది. ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మధ్య గ్లింప్స్ రిలీజ్ అవ్వగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది. అలాగే ఈ రెండు చిత్రాలతో పాటు మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు డార్లింగ్. ఇలా పాన్ ఇండియా సినిమాలు చేస్తుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మరి.. ప్రభాస్ ను రేప్ చేస్తా అన్న ఈ నటి కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.