నటి, మంత్రి రోజా గురించి ప్రత్యేక పరిచయయం అక్కర్లేదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. రాజకీయాల్లోకి ప్రవేశించి.. ఎమ్మెల్యేగా గెలిచారు. ఏపీ నూతన కేబినెట్‌లో సీఎం జగన్ ఆమెకు మంత్రి పదవి ఇచ్చాడు. ఇక రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత కూడా రోజా ఇండస్ట్రీకి దూరం కాలేదు. మరీ ముఖ్యంగా ఈటీవీలో ప్రాసరం అయ్యే జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ కార్యక్రమాలకు జడ్జ్‌గా కూడా వ్యవహరించేవారు. ఎమ్మెల్యేగా ఉండి.. ఇలాంటి షోలకు జడ్జ్‌గా చేయడం ఏంటని ఎందరు విమర్శించిన ఆమె మాత్రం.. వాటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ మినిస్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె జబర్దస్త్ షో మానేశారు. ప్రస్తుతం ఇంద్రజ.. రోజా స్థానంలో జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇంద్రజ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ వివరాలు..
ప్రస్తుతం ఇంద్రజ జబర్దస్త్ షోకి జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె రోజాకు మంత్రిగా అవకాశం రాకూడదని భగవంతుడిని కోరుకున్నాను అంటూ స్వయంగా చెప్పారు. అంతేకాక రోజా జబర్దస్త్‌కు తిరిగి వస్తే… జడ్జ్ సీటు నుంచి తాను లేచి చేశారు. ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక గొడవలు ఏమీ లేవు. రోజాపై గౌరవమే ఉంది.
ఇది కూడా చదవండి: స్టేజీపై డ్యాన్స్ అదరగొట్టిన సాయిపల్లవి! వీడియో వైరల్..
”రోజా గారు తొమ్మిదేళ్లుగా జబర్దస్త్ జడ్జ్‌గా చేస్తూ.. దానికి ఒక లెగసీ క్రియేట్ చేశారు. ఆ తర్వాత మంత్రిగా అవకాశం రావడంతో వెళ్లారు. ఇప్పుడు మాత్రమే కాదు… ఎప్పుడైనా, ఏ వేదిక మీదనైనా నేను ఇదే మాట చెబుతా. ఆవిడ ఎప్పుడు ‘జబర్దస్త్’కు వచ్చినా… లేదంటే ‘ఇంద్రజ, నేను వస్తున్నాను’ అని ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు… లేచి వెళ్ళిపోవడానికి (జబర్దస్త్ జడ్జ్ సీటు నుంచి) నేను రెడీగా ఉంటాను” అని ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ షోలో ఇంద్రజ చెప్పారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Sudheer: రష్మి పేరు వినగానే ఎమోషనల్ అయిన సుధీర్.. తను నా గుండెల్లో ఉంది అంటూ!