కొద్దిగా పని ఒత్తిడి అనిపిస్తే.. జబర్దస్త్.. సరదాగా నవ్వుకుందాం అనుకుంటే.. జబర్దస్త్.. బస్సులో వెళ్తున్నా.. జబర్దస్త్.. ఇలా జబర్దస్త్ అనే కామెడీ షో మన జీవితంలో ఓ భాగమైపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ షో గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అంతలా జనాల్లో ఈ కామెడీ షో నాటుకుపోయింది. అయితే ఈ షోకి సంబంధించి తాజాగా ప్రోమోని విడుదల చేశారు. అయితే ఈ ప్రోమోలో షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ తన పెళ్ళి ఖర్చు ఎంతో చెప్పి అందరిని షాక్ కు గురి చేసింది. మరి ఆ వివరాల్లోకి వెళితే..
తెలుగు తెరపైకి ఎందరో హీరోయిన్స్ వచ్చారు. వారిలో కొందరు మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో వారి స్థానాలను పదిల పరుచుకున్నారు. అలాంటి వారిలో ముందు వరసలో ఉన్నారు ఇంద్రజ. ఆమె అసలు పేరు రాజాతి. ఇండస్ట్రీకి వచ్చాక ఇంద్రజగా పేరు మార్చుకున్నారు. ప్రస్తుతం ఇంద్రజ జబర్ధస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా విడుదలైన జబర్ధస్త్ ప్రోమోలో కమెడీయన్ వెంకీ తన భార్యని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. అలా.. జబర్దస్త్ స్టేజ్ పై ఒక ఎమోషనల్ వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే జడ్జ్ ఇంద్రజ కూడా తన పెళ్లి జరిగిన విధానాన్ని తెలియజేసింది.
“నా పెళ్ళికి వచ్చిన అతిధులు 13 మందే, నా పెళ్ళికి అయిన ఖర్చు కూడా కేవలం రూ. 7,500 మాత్రమే” అని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. ఇక ఇంద్రజ భర్త ఆమెకి ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యడు. అలా స్నేహం ఏర్పడి దాదాపు 6 సంవత్సరాలు స్నేహితులుగా ఉండి, ఒకరి మనసు ఒకరు తెలుసుకున్న తరువాత వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా 2005లో వీరి వివాహం జరిగింది. ఇక ఇంద్రజ భర్త పేరు అబ్సన్. ఈయన చెన్నైలో వ్యాపారం చూసుకుంటారు. అలా.. ఇంద్రజ తనకి నచ్చిన వ్యక్తిని పెళ్ళాడి, లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తోంది. మరి.. ఇంద్రజ ప్రేమ, పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.