సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల ఇళ్లు, ఆఫీసులపై అప్పుడప్పుడు ఆదాయపు పన్ను(ఇన్కమ్ టాక్స్) శాఖ సోదాలు జరుపుతుందనే విషయం తెలిసిందే. కోలీవుడ్ కు చెందిన అగ్రనిర్మాతలపై ఉదయం నుంచి ఆదాయపన్ను శాఖ దాడులు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నిర్మాత కలైపులి ఎస్. థాను సహా 10 మంది నిర్మాతలు, ఫైనాన్సియర్ల కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ మంగళవారం సోదాలు నిర్వహించింది.
పన్ను ఎగవేత అనుమానాలతో తమిళనాడులోని నలభైకి పైగా ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించినట్లు ఐటీ శాఖ అధికారులు తెలిపారు. అయితే.. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన ఈ సోదాలు, సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయని చెబుతున్నారు. నిర్మాత కలైపులి థాను, అన్బుచెజియన్, ఎస్.ఆర్ ప్రభు, జ్ఞానవేల్ రాజా, మరో నలుగురు నిర్మాతల ఆఫీస్ లపై ఐటీ ముమ్మరంగా సోదాలు జరిపింది. చెన్నైలోని నుంగంబాక్కంలో అన్బుచెజియన్ ఇంటిపై ఉదయం 5 గంటల నుంచి దాడులు చేస్తోంది.
నిర్మాతలు అన్బుచెజియన్, ఎస్‌ఆర్ ప్రభు, త్యాగరాజన్, కలిపుల్లి ఎస్ .అన్బుచెజియన్‌కు చెందిన 40 చోట్ల ఐటీ శాఖ తనిఖీలు నిర్వహించింది. మధురై, చెన్నై రెండు ప్రాంతాలలో 40 చోట్ల సోదాలు నిర్వహించారు. వీరితో పాటు పలు సినీ ఫైనాన్షియర్లపై కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి. కాగా తమిళ నిర్మాత అశోక్ కుమార్ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఫేస్ చేస్తున్న అన్బుచెజియన్‌పై ఐటీ దాడులు జరగడం ఇది మూడోసారి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
In a massive crackdown on Kollywood and ill-gotten money, IT department officials raids film producer Anbucheliyan residence and properties in Chennai and Madurai districts.
Raids are carried out at least in 40 places. #itraid @News18TamilNadu pic.twitter.com/lnizCPVfbL
— विष्णू सिंह (@_EkBharatiya_) August 2, 2022