రామ్ చరణ్- రాజమౌళి- తారక్ క్రేజీ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం మార్చి 25న విడుదలకు ముస్తాబైంది. చిత్ర బృందం మళ్లీ ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. అన్ని భాషల ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ చేస్తున్నారు.
ముఖ్యంగా రామ్ చరణ్- తారక్- రాజమౌళి ఇంటర్వ్యూలు, ఇంటరాక్షన్స్ చేస్తున్నారు. గతంలో జరిగిన కార్యక్రమాల్లో చెర్రీ- తారక్ కలిసి రాజమౌళిని ఎలా ఆటపట్టించారో చూశాం. తాజాగా గత అనుభవాలను మనసులో పెట్టుకుని జక్కన్న ప్రతీకారం తీర్చుకున్నాడు. హోస్ట్ ఇంటర్వ్యూ చేసి సైన్ ఆఫ్ చెప్పగానే రాజమౌళి రామ్ చరణ్- ఎన్టీఆర్ లను గిల్లి ఫాస్ట్ గా పారిపోయాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వైరల్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం మరో బాహుబలి కాబోతోందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.