ప్రస్తుతం టీవీ షోలని ఏలుతున్నది ఎవరంటే.. చాలామంది చెప్పే పేరు హైపర్ ఆది. మొన్నటివరకు సుడిగాలి సుధీర్ ఉండేవాడు. కానీ మనోడు వెళ్లిపోయిన తర్వాత ఆది పూర్తిగా ఫేమ్ సంపాదించాడు. ఓ సాధారణ కమెడియన్ గా మొదలైన ఆది జర్నీ.. ఇప్పుడు అన్ని షోల్లో మెయిన్ రోల్ పోషించేంత వరకు వెళ్లిపోయింది. ఈవెంట్ ఏదైనా సరే ఆది కచ్చితంగా ఉండాల్సిందే అనే పరిస్థితి తయారైంది. అయితే ఆది స్కిట్స్, పంచులపైనా కూడా కొన్నిసార్లు సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా ఓ సీనియర్ జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హైపర్ ఆది, తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన, అలవాటైనా పేరు. ‘జబర్దస్త్’ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ ఆర్థికంగా సెటిలైనప్పటికీ.. ఆదిలా పేరు తెచ్చుకున్న వాళ్లు మాత్రం ఎవరూ లేరు. ఎందుకంటే ‘జబర్దస్త్’లో రైటర్ గా కెరీర్ ప్రారంభించిన ఆది.. ఆ తర్వాత అదిరే అభి టీమ్ లో సహాయ పాత్రలు కూడా చేశాడు. ఆ తర్వాత టీమ్ లీడర్ గా మారి చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పలు షోలకు హోస్ట్ కంటే ఎక్కువగా ఎంటర్ టైన్ చేస్తూ పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావించిన సీనియర్ జర్నలిస్టు ఇమంద రామారావు.. పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కమెడినయ్ ఆరోగ్యకర కామెడీ చేయాలి గానీ, ఎదుటివారిని బాధపెట్టి నవ్వించకూడదని అన్నారు.
‘జబర్దస్త్ లో ఉన్న కంటెస్టెంట్స్, టీమ్ లీడర్స్ రెమ్యూనరేషన్స్ ఎక్కువగా ఉంటాయి. రేటింగ్ బట్టి వాళ్లకు డబ్బులిస్తుంటారు. అయితే జబర్దస్త్ లో కొంతమంది కామెడీ మళ్లీ మళ్లీ చూసేలా ఉంటుంది. కానీ ఆది లాంటి వాళ్లు మాత్రం అసభ్యకర కామెడీ చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఈ షోకి దూరం చేస్తున్నారు. ఆది కామెడీ.. ఎంతసేపు పక్కవారిమీద పంచులు వేయడమే. వారు నొచ్చుకునేలా వారి ఆహార్యం, అందంపై జోకులు వేసి నవ్విస్తాడు. తాను తప్ప ఇంకెవరూ కామెడీ చేయలేరని అన్నట్లు ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. తానే పెద్ద హీరోలా బిహేవ్ చేస్తున్నాడు. అందుకే సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ ఆదిని బూతులు తిడుతున్నారు.’ అని ఇమంది అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో హాట్ టాపిక్ గా మారింది.