తాను ప్రెగ్నెంట్ అంటూ అభిమానులకు షాక్ ఇచ్చింది ఇలియానా. అయితే ఇప్పటికి కూడా చాలా మంది ఈ వార్తను నమ్మడం లేదు. ఈ క్రమంలో తాజాగా తొలిసారి బేబీ బంప్‌తో కనిపించే ఫొటోలు షేర్ చేసి క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు..
ఇలియానా.. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా రాణించింది. సౌత్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న నటిగా రికార్డు సృష్టించింది. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ గోవా బ్యూటీ.. తర్వాత బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ పలు హిట్ చిత్రాల్లో యాక్ట్ చేసినప్పటికి.. సౌత్‌లో వచ్చినంత గుర్తింపు, స్టార్‌డమ్ రాలేదు. కొన్ని రోజుల పాటు ఎలాంటి అవకాశాలు లేకుండా గడిపింది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో రవి తేజ సరసన యాక్ట్ చేసింది. కానీ ఆ సినిమా కూడా ఇలియానాకు హెల్ప్ అవ్వలేదు. కెరీర్‌లో గ్యాప్ మాత్రమే కాక వ్యక్తిగత జీవితంలో కూడా లవ్ బ్రేకప్ అయ్యి.. చాలా బాధపడింది. ఇక కెరీర్, పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా.. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది ఇలియానా.
ఈ క్రమంలో తాజాగా తాను తాను ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. అభిమానులకు షాకిచ్చింది ఇలియానా. ఆ తర్వాత బేబీ బంప్ వీడియో కూడా షేర్ చేసింది. కానీ ఇప్పటికి కూడా అభిమానులు ఇదేదో సినిమా ప్రమోషన్ అనే అనుమానంలో ఉన్నారు. వారి డౌట్స్ క్లారిఫై చేస్తూ.. తాను ప్రెగ్నెంట్ అంటూ క్లియర్ కట్ ఆన్సర్ చేప్పింది ఇలియానా. బేబీ బంప్ కనిపించేలా ఉన్న తన ఫొటోలు షేర్ చేసి.. మరోసారి అభిమానులను షాక్‌కు గురి చేసింది.
బేబీ బంప్‌ను బయటకు కనిపించేలా ఉన్న బ్లాక్ స్కిన్ టైట్ డ్రెస్‌లో.. చేతిలో డ్రింక్ గ్లాస్‌తో నవ్వుతూ ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇలియానా. దాంతో.. ఈ గోవా బ్యూటీ నిజంగానే తల్లి కాబోతుంది.. అని క్లారిటీ వచ్చింది. ఈ ఫొటోలు చూసిన కొందరు.. పెళ్లి కాలేదు.. మరి ప్రెగ్నెంట్ ఏంటి.. ఇంతకు బిడ్డకు తండ్రి ఎవరూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం.. శుభాకాంక్షలు.. మాతృత్వాన్ని ఏంజాయ్ చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా బేబీ బంప్ ఫొటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది ఇలియానా.