చిరంజీవి ఓ సీన్, ఫైట్ డైరెక్ట్ చేశారని తెలుసా..? ఇంతకు ఏ సినిమాలో అంటే.

ఎవ్వరి అండ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చిన కొణిదెల శివశంకర వర ప్రసాద్..ఇంతింతై వటుడింతయై అన్న చందంగా ఎదిగారు. సినిమా పరిశ్రమలో ఉన్నత శిఖరాలకు చేరారు. డ్యాన్సులు, స్టైలిష్‍కు అభిమానులు కానీ వారు ఎవ్వరూ ఉండరు. తన నటనతో అబిమానులతో మెగాస్టార్ అన్న బిరుదును పొందారు. అయితే ఆయనకు ఓ కోరిక ఉందంట.. ఇంతకూ అదేంటంటే..?

తెలుగు భాషను ప్రపంచానికి పరిచయం చేసిన నటుడు సీనియర్ నటుడు ఎన్టీ రామారావు అయితే.. తెలుగు సినిమాను నలు దిశలా చాటిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఎవ్వరి అండ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చిన కొణిదెల శివశంకర వర ప్రసాద్..ఇంతింతై వటుడింతయై అన్న చందంగా ఎదిగారు. సినిమా పరిశ్రమలో ఉన్నత శిఖరాలకు చేరారు. ఆయన డ్యాన్సులు, స్టైలిష్‍కు అభిమానులు కానీ వారు ఎవ్వరూ ఉండరు. తన నటనతో అబిమానులతో మెగాస్టార్ అన్న బిరుదును పొందారు. ఇప్పడు సినిమాల్లోకి వస్తున్న యంగ్ నటుల్లో చాలా మందికి చిరంజీవి అంటే అమితమైన ఇష్టం. ఆయన్ను ప్రేరణగా తీసుకుని.. ఎటువంటి వారసత్వం లేకపోయినా సినిమాల్లోకి వస్తున్నావారెందరో ఉన్నారు. సినిమా పరిశ్రమకు ఇప్పుడు పెద్దగా దిక్కుగా నిలుస్తున్న చిరంజీవి అంటే ప్రతి ఒక్కరికి గౌరవం. అయితే ఆయనకు కూడా ఓ కోరిక ఉందని తెలుసా.. అదీ పూర్తిగా కాకపోయినా కొంత తీరిందట. ఈ విషయాన్ని నటులు తణికెళ్ల భరణి వెల్లడించారు.

తనికెళ్ల భరణి తన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ మధ్య వరుస వీడియోలు పెడుతున్నారు. కొంత మంది సినీ ప్రముఖుల గురించి ఆసక్తికర విషయాలు చెబుతున్నారు. ఆ సినీ ప్రముఖులతో తనకు ఉన్న అనుబంధం గురించి వెల్లడిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి గురించి ఒక వీడియో చేశారు. చిరంజీవిని పొగడ్తలతో ముంచెత్తారు. ‘చిరంజీవి గారు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఎవరి అండా లేకుండా స్వయంకృషితో మెగాస్టార్ అయ్యారు. అది కొన్ని వందల వేల మందికి ఇన్‌స్పిరేషన్. అలాంటి చిరంజీవిని మా గురువు రాళ్లపల్లి గారు మొదట పరిచయం చేశారు. ‘కుక్కకాటుకి చెప్పు దెబ్బ’ అనే సినిమా షూటింగ్ జరుగుతుంటే.. అక్కడ నాకు చిరంజీవిని పరిచయం చేశారు. అదే నేను చిరంజీవిని తొలిసారి చూడటం. ఆ తరవాత ఆయనతో చాలా సినిమాలు చేశాను. అందులో ఒక సినిమా అనుభూతి ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని ఓ ఆసక్తికరమైన న్యూస్ చెప్పారు. అదేంటంటే.. మెగాస్టార్ చిరంజీవికి తెర ముందే కాదూ.. కమెరా వెనుక ఉంటూ డైరెక్టర్ చేయాలని కోరిక ఉండేదట. ఓ సినిమా డైరెక్టర్ చేయాలని ఉందని గతంలో కూడా ఆయన చెప్పారు. అయితే ఆయన కోరిక ఇప్పటి వరకు తీరలేదు..

కానీ ఓ సినిమా సమయంలో మాత్రం తన కోరికను తీర్చుకుని.. ఓ సీన్, ఫైట్ కంపోజ్ చేశారట. ఆ సినిమానే బిగ్ బాస్. ఈ సినిమా చిరంజీవికి అతి పెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అయితే ఈ సినిమాలోని ఓ ఫైట్ సీన్ కంపోజ్ చేశారట చిరంజీవి. చిరంజీవి డైరెక్ట్ చేసిన ఆ సీన్‌లో తాను నటించానని తణికెళ్ల భరణి చెప్పారు. ఈ సినిమాకు విజయ్ బాపినీడు అసలు దర్శకుడు కాగా, విజయ బాపినీడు ఫ్రెండ్‌కి బాలేదని వెళ్తే చిరంజీవి డేట్స్ లేని కారణంగా ఆ రోజంతా ఆయనే డైరెక్షన్ కూడా భుజాలకు ఎత్తుకున్నారని తెలిపారు. ఆ సినిమాలో నేను దుర్మార్గపు పోలీస్ పాత్రలో కనిపించానన్నారు. అందులో కీలక సన్నివేశాన్ని చిరంజీవి డైరెక్ట్ చేశారు. అదేంటంటే.. అయ్యప్ప మాలలో ఉన్న చిరంజీవిని అరెస్టు చేసేందుకు తణికెళ్ల భరణి వెళ్లే సీన్. ఆ తర్వాత వచ్చే ఫైట్ మొత్తం ఆయనే డైరెక్ట్ చేసినట్లు భరణి చెప్పారు. చిరంజీవి దర్శకత్వం వహించిన విషయాన్ని ఆ వీడియాలో చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed