iBOMMA: లాక్ డౌన్ కాలంలో సినీ ప్రియులంతా ఓటీటీలకు అలవాటుపడిన సంగతి తెలిసిందే. థియేటర్ లో విడుదలవుతున్న సినిమాలకంటే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడ ఓటిటిలు అందించే సినిమాలు, కంటెంట్ ని బట్టి సబ్ స్క్రిప్షన్ చేసుకోవాలా లేదా అనేది ఆలోచిస్తారు. అయితే.. ఎంత ఓటిటి సినిమాలైనా అన్ని ఓటీటీలను సబ్ స్క్రైబ్ చేసుకోలేం కదా.. అందుకని కావాల్సిన ఓటిటి ఒకటి సబ్ స్క్రైబ్ చేసుకొని మిగతా సినిమాలను కొన్ని వెబ్ సైట్స్ లో డౌన్ లోడ్ చేసుకుంటారు.
అలాంటి వారి కోసం కుప్పలుగా వెబ్ సైట్లు పుట్టుకొచ్చాయి. ఇదివరకు ‘తమిళరాకర్స్’.. ఆ తర్వాత ‘మూవీ రూల్జ్’ వంటి వెబ్ సైట్లు పైరసీ చిత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చేవి. ఆ కోవకు చెందిన వాటిలో ప్రస్తుతం పాపులర్ అయ్యింది ‘ఐబొమ్మ‘ వెబ్ సైట్. ఈ ఐబొమ్మ వెబ్ సైట్ కు తెలుగు సినిమా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించడం విశేషం. నిజానికి ఇలాంటి వెబ్ సైట్స్ లో మూవీ స్ట్రీమింగ్ అనేది నైతికత కాదు. అదీగాక నిర్మాతలు, ఓటీటీ సంస్థల నుంచి సైతం ఇలాంటి సైట్స్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటం చూస్తూనే ఉన్నాం.
ఏ ఓటీటీలో సినిమా విడుదలైనా గంటల వ్యవధిలోనే ఈ వెబ్ సైట్ లో ప్రత్యక్షమవుతాయి. నేరుగా వెబ్ సైట్ నుంచి సినిమా డౌన్ లోడ్ చేసుకోవచ్చు, లేదా ఆన్ లైన్‌లో చూడచ్చు. అలా యూజర్ ఫ్రెండ్లీగా పేరు సంపాదించుకున్న ఈ వెబ్ సైట్ సడెన్ గా వెబ్ సైట్ భారత్ లో సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అందుకు తగిన వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో ఐబొమ్మ ఫ్యాన్స్ అంతా నిరాశచెందారు. కానీ.. తాజాగా ఐబొమ్మ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది.
భారత్ లో ఐబొమ్మ సేవలను తిరిగి ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించినట్లు సమాచారం. ఇండియాలో మా సేవలను పూర్తిగా నిలిపివేయడం లేదా ఈ వెబ్ సైట్ ని ఎవరికైనా అప్పగించడం చేయాలనుకుంటున్నాం అని చెప్పిన ఐబొమ్మ నిర్వాహకులు.. తాజాగా ఐబొమ్మ నిలిపివేతపై వస్తున్న వ్యతిరేకతను, యూసర్ల ఆధారణాభిమానాలను దృష్టిలో పెట్టుకొని సేవలను పునఃప్రారంభించనున్నట్లు తెలిపింది. దీంతో సినీ ప్రియులంతా సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
IBOMMA is Back 🔥🤟
Mana request kuda chusinatunaru 🥳 https://t.co/suqhyKI7HB pic.twitter.com/zhVGICKWIN— Bharath RC Kajuu™🔥 (@BharathRCKajal) July 7, 2022