తక్కువ సమయంలోనే, తక్కువ సినిమాలతోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్ . ఈ నగరానికి ఏమైంది తర్వాత.. ఫలక్ నామా దాస్ అంటూ అతడే డైరెక్ట్ చేసుకున్నాడు. ఆ సినిమాతో మంచి హైప్ వచ్చింది. తాజాగా దాస్ కా ధమ్కీ అంటూ ముందుకు వచ్చాడు విశ్వక్ సేన్. ఇప్పుడు ఆయన చేసిన పోస్టు..
విశ్వక్ సేన్.. సినిమాల మీద ఫ్యాషన్ తో ఈ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. వెళ్లిపోమాకేతో తెలుగు పరిశ్రమకు పరిచమయ్యాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకపోయినప్పటికీ.. తనను తాను నిరూపించుకునేందుకు బాగా కష్టపడ్డాడు. తక్కువ సమయంలోనే, తక్కువ సినిమాలతోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ నగరానికి ఏమైంది తర్వాత.. ఫలక్ నామా దాస్ అంటూ అతడే డైరెక్షన్ చేసుకున్నాడు. ఆ సినిమాతో మంచి హైప్ వచ్చింది. తర్వాత హిట్ మంచి హిట్ కొట్టిన అతడు.. పాగల్, అశోక వనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా అంటూ ముందుకొచ్చాడు. తాజాగా దాస్ కా ధమ్కీ అంటూ ముందుకు వచ్చాడు విశ్వక్ సేన్. అయితే ఇటీవల ఓ సినిమా విషయంలో వివాదమే నడిచింది. ఆ సినిమా నుండి అనూహ్యంగా తప్పుకున్న సంగతి విదితమే.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా గడుపుతున్న విశ్వక్ తాజాగా ఆయన చేసిన ఓ పోస్టు తెగ వైరల్‌గా మారింది. ‘విజయం, పరాజయం, ప్రశంసలు, విమర్శలు అన్నింటినీ చూశాను. అలాగే నేను చేయని తప్పులకు ప్రశ్నలు ఎదుర్కొన్నాను. నిందలు పడ్డాను. నా హార్డ్ వర్క్ కు పొగడ్తలు అందుకున్నాను.. ఒకవేళ తెలియక చేసిన తప్పుల వల్ల విమర్శలు ఎదుర్కొని ఉండొచ్చ, కానీ నేను ఎవరికీ హాని చేయలేదు. పోరాటాలు జరుగుతున్నప్పటికీ నా ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తున్నాను. ఉద్దేశపూర్వక ప్రతికూలత.. నిన్ను ఒక ఫెయిల్యూర్ గా నిర్వహించడానికి ఛాన్స్ ఇవ్వద్దు. క్లిష్ట సమయాలకు మించి జీవితంలో మరెంతో ఉంటుంది. మానవ జన్మ ఎత్తినందుకు ఆనందించండి. కలలను సాకారం చేసుకునేందుకు కష్టపడ్డండి’ అంటూ ఎమోషనల్ పోస్టు చేశాడు.
తాజాగా విశ్వక్ షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతుంది. అయితే ఈ పోస్టు దేన్ని ఉద్దేశించి పెట్టాడా అన్న సందేహం మొదలైంది అభిమానుల్లో. అయితే ప్రస్తుతం ఆయన 11వ సినిమా తెరకెక్కబోతోంది. ‘గంగామ్మ జాతర మొదలైంది. ఈసారి శివాలెత్తి పోద్ది’అంటూ కొత్త సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. సితారా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఆయన సినిమాల్లో మీకు ఏ సినిమా ఇష్టమో చెప్పండి.