జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏపీలోని కాకినాడలో వారాహి యాత్ర చేపడుతున్నారు. శుక్రవారం పిఠాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా జూ. ఎన్టీఆర్‌పై వ్యాఖ్యలు చేశారు.
టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కాకినాడ జిల్లాలో వారాహి యాత్ర నిర్వహిస్తున్నారు. నిన్న పిఠాపురంలో పర్యటించారు. పిఠాపురం యాత్ర సందర్భంగా పవన్ కల్యాణ్.. జూనియర్ ఎన్టీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోడ్ షో సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘ నేను ఫ్యాన్ క్లబ్ పెట్టలేదు. నా తోటి సినిమా నటులందరి మీద నాకు గౌరవం, ఇష్టం ఉంటుంది. వాళ్ల సినిమాలు నేను బాగా చూస్తాను. సినిమా వేరు రాజకీయం వేరు. మీరందరూ రకరకలా హీరోలను అభిమానించండి.. ఇష్టపడండి.
కానీ, రాష్ట్ర ప్రయోజనాల దగ్గరకు వచ్చే సరికి. కేవలం రాష్ట్ర ప్రయోజనాల గురించే ఆలోచించండి. నాకు రామ్ చరణ్ ఇష్టం.. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం.. ప్రభాస్ అంటే ఇష్టం.. చిరంజీవి ఇష్టం. అందరు హీరోలను చూస్తాను నేను. నాకు ఆనందం. నా ఒక్కడి వల్ల చిత్ర పరిశ్రమ ఆడిద్దా.. దేశంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే వారిలో నేనూ ఒకడ్ని. నేనొకడ్నే అని చెప్పటం లేదు. నేను ఓ సినిమా చేస్తే ఓ 500 మందికి ఉపాధి లభిస్తుంది’’ అని అన్నారు.
ఇక, పవన్- జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం అని అన్న వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అటు పవన్ ఫ్యాన్స్‌తో పాటు.. ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ వీడియోను షేర్ చేస్తూ హల్‌చల్ చేస్తూ ఉన్నారు. కాగా, మరో ఆరు నెలల పాటు ఏపీలో వారాహి యాత్ర చేపట్టనున్నారు. మొదటి ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. తర్వాత మిగిలిన జిల్లాల్లో పర్యటిస్తారు. మరి, పవన్- జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం అని అనటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.