సీనియర్ నటీనటులంతా ఇటీవల మళ్లీ తెరపై కనిపిస్తున్నారు. కొంత మంది పాత తరం నటులు ఏమయ్యారో కూడా తెలియదు. అటువంటి వారిని వెలుగులోకి తెస్తూ.. వారితో ఇంటర్వ్యూలు చేస్తోంది సుమన్ టీవీ. తాజాగా మరో సీనియర్ నటుడు అశోక్ కుమార్‌ను అభిమానుల ముందుకు తీసుకు వచ్చింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి సినిమాల్లో నటించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆయన కుమార్తెనే నటి రంజిత.
సీనియర్ నటీనటులంతా ఇటీవల మళ్లీ తెరపై కనిపిస్తున్నారు. కొంత మంది పాత తరం నటులు ఏమయ్యారో కూడా తెలియదు. అటువంటి వారిని వెలుగులోకి తెస్తూ.. వారితో ఇంటర్వ్యూలు చేస్తోంది సుమన్ టీవీ. తాజాగా మరో సీనియర్ నటుడు అశోక్ కుమార్‌ను అభిమానుల ముందుకు తీసుకు వచ్చింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి సినిమాల్లో నటించారు. గురువును మించిన శిష్యులు, బుద్ధిమంతులు, అందాల రాముడు వంటి సూపర్ డూపర్ హిట్స్ సినిమాలతో పాటు దాదాపు 25 సినిమా వరకు చిత్రాల్లో విలన్‌గా నటించారు. కానీ అనూహ్యంగా ఆయన సినిమాల నుండి తప్పుకున్నారు. సినిమా నుండి తప్పుకోవడంతో పాటు నిత్యానంద ఆయన జీవితంలో సృష్టించిన అలజడి వరకు అన్ని పంచుకున్నారు. ఇంకా ఎన్నో విషయాలు పంచుకుని ఆశ్చర్య పరిచారు. ఇంకో విషయం ఏంటంటే ఈయన కుమార్తెల్లో ఒకరు ప్రముఖ నటి రంజిత. తెలుగులో దాదాపుగా పది సినిమాల వరకు చేసింది.
‘హైదరాబాద్‌లో పోలీసాఫీసర్ గా పని చేశాను.. ఆ సమయంలో తన మ్యారేజ్ లైఫ్ స్పాయిల్ అవ్వడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి హోటల్ నడిపాను. అయితే నష్టాలు వచ్చి దివాలా తీయడంతో మా బావ ఆ హోటల్ తీసుకున్నారు. ఏం చేయాలో తోచక..మద్రాస్ వచ్చాను. కొన్ని ప్రాంతాల్లో ఉండగా.. చివరకు పాండి బజార్ వచ్చాను. ఆ సమయంలో సినిమా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత విలన్ వేషాలు వచ్చాయి. బుద్దిమంతుడు, మహా బలుడు, ఇంటి గౌరవం సినిమాల్లో విలన్‌గా నటించాను. తర్వాత సహాయ పాత్రల్లో నటించాను. ఓ వేషం కోసం నాగేశ్వరరావుతో భేటీ అయ్యాక.. రామానాయుడు సినిమాలో హీరోగా అవకాశం పోయింది. ఇలా హీరోగా కొన్ని అవకాశాలు పోవడంతో ఆత్మాభిమానం దెబ్బతింది. ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానా? ఇక్కడికి వచ్చి తప్పు చేశానని ఫీలయ్యాను. ఆ ఉద్యోగం ఎందుకు మానేసి వచ్చానని భావించా. ఈ పరిశ్రమకు నేను పనికి రానని తెలిసి సినిమాలు మానేశాను’అని చెప్పుకొచ్చారు.
దాసరి నారాయణ రావు కూడా ఓ సినిమాకు హీరోగా ప్రకటించి.. మోహన్ బాబు అడగడంతో అతడిని హీరోగా పెట్టుకున్నారన్నారు. వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ.. ‘పా భార్యను చూడకుండానే పెళ్లి చేసుకున్నాను. తీరా మండపంలో చూశాక ఆమె నాకు నచ్చలేదు. కానీ చేసేదేం లేక మనసొప్పకపోయినా పెళ్లి చేసుకున్నాను. ఈ కారణం వల్లే ఉద్యోగానికి రాజీనామా చేశాను. కొన్నాళ్లకు తప్పు తెలుసుకున్నాను. నా వల్ల అమ్మాయిని బాధపడుతోందని తనను నాతోపాటే మద్రాసుకు తీసుకొచ్చాను. మాకు ముగ్గురు ఆడపిల్లలు.. పెద్ద చదువులు చదివించాను. ముగ్గురికీ పెళ్లి చేశా.. ఇద్దరికి విడాకులయ్యాయి’అన్నారు. పెద్దమ్మాయికి విజయవాడ గన్నవరం దగ్గర ఉన్న మేనల్లుడితో పెళ్లి చేశా. రెండో అమ్మాయికి ఆర్మీ జనరల్ తో లవ్ మ్యారేజ్ చేశా. మూడో అమ్మాయి ముంబయిలో ఉంది.వీరిలో రెండో అమ్మాయి నటి అని చెప్పారు. ఆమెనే రంజిత.
నిత్యానంద గురించి టాపిక్ వల్లే ఆమె హైలెట్ అయ్యింది. తెలుగులో మావిచిగురు, శ్రీరాములయ్య, మైసమ్మ ఐపిఎస్ వంటి సినిమాలో నటించింది. లవ్ మ్యారేజ్ చేసుకున్నాక. ప్రెగ్నెన్నీ వచ్చిన సమయంలో చేసిన ఆపరేషన్ వల్ల పూర్తిగా పిల్లలు పుట్టేందుకు అనర్హురాలు అయ్యిందన్నారు. అయితే ఆ తర్వాత రంజిత, ఆమె భర్త విడాకులు తీసుకున్నారు. రంజిత, నిత్యానంద పెళ్లి చేసుకున్నారని వార్తలు, ఫోటోలు వచ్చాయి. అందులో ఎంత నిజముందో తెలియదన్నారు. అయతే ఈ విడాకుల వెనుక నిత్యానంద ప్రమేయం ఉందని అన్నారు. పెద్దకుమార్తె కూడా భర్తకు విడాకులు ఇచ్చి.. నిత్యానంద వద్దకు వెళ్లిపోయారు. మోక్షం, భక్తి వల్ల మేము ఇక్కడ హ్యాపీగా ఉన్నామన్నారు. కానీ తాను వారిద్దరినీ తిట్టానని అన్నారు. ‘కోపంతో నేనోసారి నిత్యానంద దగ్గరకు వెళ్లి.. నీకు సిగ్గు అనిపించడం లేదా? నా కూతుర్ని నీ ఆశ్రమం నుంచి వెనక్కు పంపించు అని అడిగాను’ అని తెలిపారు. వారి వల్లే తన భార్య అనారోగ్యం బారిన పడిందని… ‘ఛీ దరిద్రపు ముండల్లారా.. నా కడుపున చెడ పుట్టారు’ అంటూ ఆసుపత్రిలో చనిపోయిందీ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మూడో కూతురు నన్ను చూస్తుందని, తనకే మేసేజ్ చేసి .. తాము హ్యాపీగా ఉన్నామని అక్కలు చెబుతున్నారని తెలిపారు.