చిత్ర పరిశ్రమలో ఎందరో కథానాయకులు ఉంటారు. కొందరు నటనతో ప్రేక్షకుల అభిమానం చురగొంటే.. మరికొందరు సమాజసేవ ద్వారా అభిమానులకు దగ్గర అవుతారు. కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం ఆ రెండింటితో అభిమానుల గుండెల్లో తనదైన ముద్ర వేశాడు. రజినీకాంత్ కు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సూపర్ స్టార్ ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వాటికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
తాజాగా చెన్నైలో నిర్వహించిన ”హ్యాపీ సక్సెస్ ఫుల్ లైఫ్ థ్రూ క్రియ యోగా” కార్యక్రమంలో రజినీకాంత్ పాల్గోన్నారు. ఈ క్రమంలో తన జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. తాను చేసిని సినిమాలన్నింటిలో తనకు రెండే నచ్చాయని తెలిపారు. ఆయన మాట్లాడుతూ..
”ఒక నటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ ‘బాబా’, ‘రాఘవేంద్ర’ సినిమాలు మాత్రమే నాకు ఆత్మ సంతృప్తిని చ్చాయి. ఆ చిత్రాల తర్వాతే ఆ సద్గురువుల గురించి జనాలకు తెలిసింది. ఈ రెండు మూవీలను చూసి నా అభిమానుల్లో ఇద్దరు సన్యాసం తీసుకున్నారు. కానీ నేను మాత్రం ఇంకా నటుడిగానే ఉన్నా. హిమాలయాలు అద్భుతమైనవని అక్కడ ఉండే మూలికలు చాలా శక్తివంతమైనవి.” అంటూనే..
”నేను జీవితంలో ఎన్నో విజయాలను చూశాను. పేరు ప్రతిష్ఠలు, డబ్బు సంపాదించా.. అయినప్పటికీ సిద్దులకు ఉండే ప్రశాంతతలో 10 శాతం కూడా నాకు లేదన్నారు. ఎందుకంటే అవన్నీ అశాశ్వతమైనవి”. అని రజినీకాంత్ వివరించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైయ్యాయి. మరి రజినీ కాంత్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.