స్టార్ కమెడియన్ హైపర్ ఆదికి ఏకంగా స్టేజీపైనే గుండు కొట్టేశారు. దీంతో టీవీ ప్రేక్షకులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇలా జరిగిందేమిటి అని ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్స్ కూడా ఈ విషయమై తలో రకంగా మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు మిగిలిన షోల్లోనూ ఆది.. కీలకపాత్ర పోషిస్తున్నాడు. ప్రతి షోకు సంబంధించి తను కీలకంగా ఉంటున్నాడు. అందుకు తగ్గట్లే కొన్ని ఎపిసోడ్లు, అందులో కాంట్రవర్సీ స్కిట్స్ ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పుడు జరిగింది కూడా అలాంటిదే.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హైపర్ ఆది గురించి టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘జబర్దస్త్’లోకి రైటర్ గా ఎంట్రీ ఇచ్చిన మనోడు.. తన పెన్ పవర్ తో టీం లీడర్ అయిపోయాడు. ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’లో సుధీర్ స్కిట్ కోసం ఆడియెన్స్ ఎంతగా ఎదురుచూసేవారో.. తన స్కిట్ కోసమే ప్రేక్షకులు ఎదురుచూసే స్థాయికి హైపర్ ఆది వెళ్లిపోయాడు. ఇక జబర్దస్త్ మాత్రమే కాకుండా ప్రతి ఆదివారం మధ్యాహ్నం టెలికాస్ట్ అయ్యే ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లోనూ ఆది లీడ్ రోల్ ప్లే చేస్తూ వస్తున్నాడు.
హైపర్ ఆది స్కిట్లు, అందులోని డైలాగ్స్ పై ఎప్పటినుంచో విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఓవైపు కాంట్రవర్సీలు అవుతున్నా సరే.. జనాలు కూడా వాటిని చూస్తున్నారు. దీంతో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో ఎప్పుడూ ఏదో ఒకటి షాకింగ్ స్కిట్ చేస్తూనే వచ్చారు. గత వారం కూడా యూట్యూబ్ థంబ్ నెయిల్స్ గురించి ఓ స్కిట్ చేశారు. ఇప్పుడు ఏకంగా షాకింగ్ టాస్క్ పెట్టారు. ఓ నంబరుని సెలెక్ట్ చేసుకోవాలి, దాని వెనక ఏముంటే అది చేయాలి అని యాంకర్ రష్మీ చెప్పింది. ఇందులో భాగంగా ఆది… 11 నంబర్ సెలెక్ట్ చేసుకున్నాడు. ‘గుండు కొట్టించుకోవాలి’ అని దాని వెనక చూపించింది. దీంతో మిగతా కమెడియన్స్ అందరూ ఆదికి గుండు కొట్టించాల్సిందేనని పట్టుబట్టారు. అందుకు సంబంధించి ఆదికి గుండు కొట్టినట్లు ఓ ప్రోమోని రిలీజ్ చేశారు. అయితే టీఆర్పీ కోసమే ఇదంతా అని నెటిజన్లు అంటున్నారు. గతంలోనూ ఇలాంటివి చాలా చూశాంలే అని పెదవి విరుస్తున్నారు.