హైపర్ ఆది మరోసారి పవర్ ఫుల్ స్పీచ్ తో వావ్ రెచ్చిపోయాడు. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్.. ఇలా ముగ్గురికి ఓ రేంజులో మాస్ ఎలివేషన్స్ ఇచ్చేలా మాట్లాడాడు. ఇప్పుడు ఇది మెగా అభిమానులని ఫుల్ ఖుషీ చేస్తోంది.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగాయి. శిల్పాకళావేదికలో ఆదివారం అయిన ఈ ఈవెంట్ లో అందరూ ఏమో గానీ హైపర్ ఆది మాత్రం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. తన పవర్ ఫుల్ స్పీచ్ తో అదరగొట్టేశాడు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు మాస్ రేంజులో ఎలివేషన్స్ ఇచ్చిన హైపర్ ఆది.. అదే ఊపులో రామ్ చరణ్ ని కూడా ఆకాశానికెత్తేశాడు. తన మాటలతో అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించి, వాళ్లు ఊగిపోయేలా చేశాడు. ప్రస్తుతం ఈ స్పీచ్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ హైపర్ ఆది ఏమేం మాట్లాడాడో తెలుసా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ మధ్య కాలంలో హైపర్ ఆది, తన స్పీచులతో బాగా పాపులర్ అయిపోతున్నాడు. మైక్ పట్టుకుంటే చాలు ప్రాసలు, పంచులతో అదరగొట్టేస్తున్నాడు. ప్రేక్షకుల్ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తున్నాడు. తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆది.. మెగాస్టార్ చిరంజీవిని విమర్శించేవాళ్లకు వరస కౌంటర్స్ వేశాడు. ‘ఓ మనిషిని చూడగానే 10 మంది దండం పెడితే అది మెగాస్టార్. ఓ మనిషి పదిమందికి అన్నం పెడితే అది పవర్ స్టార్. తన తండ్రిలా భుజం తట్టి ఎంకరేజ్ చేయడమూ తెలుసు. తన బాబాయ్ లాగా భోజనం పెట్టి హెల్ప్ చేయడమూ తెలుసు. దటీజ్ మెగాపవర్ స్టార్’ అని ముగ్గురు మెగాహీరోల్ని ఆకాశానికెత్తేశాడు.
‘జనరేషన్స్ మారొచ్చు, కొత్త హీరోలు రావొచ్చు, కొత్తకొత్త రికార్డులు క్రియేట్ చేయొచ్చు. కానీ ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే రికార్డులు అనే పదం పుట్టిందే మెగాస్టార్ తో. ‘ఆచార్య’ సినిమా కొంచెం అటు ఇటు అయితే చిరంజీవి పని అయిపోయిందని వాడెవడో రాశాడు. ‘వాల్తేరు వీరయ్య’తో వాడి గూబ పగలగొట్టి రికార్డులు కొల్లగొట్టి ఒక్కసారి నంబర్ వన్ అయితే ఆల్వేజ్ నెంబర్ వన్ రా అని ప్రూవ్ చేసిన స్టార్ మెగాస్టార్’ అని హైపర్ ఆది మాస్ స్పీచ్ తో రచ్చలేపాడు. ఇక పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ పూనకం వచ్చినట్లు రెచ్చిపోయాడు.
‘ఈయన జనాభా లెక్కల్లో ఒక్కడు కాదు. లెక్కలేనంత జనాభాకు ఒకే ఒక్కడు. సమస్య తలుపు తడితే పరిష్కారాన్ని ఇంట్లో ఉంచే ఘనుడు. అభిమానుల గుండెల్లో దేవుడు. శత్రువుల గుండెల్లో ప్రచండుడు, ప్రచారం అవసరం లేని ప్రభంజనుడు, అలుపెరగని సేవకుడు, అసలు సిసలైన నాయకుడు, నిజమైన లోక కల్యాణుడు, నిస్వార్థమైన మన పవన్ కల్యాణుడు. చెప్పే ప్రతిమాటలో నీతి, చేసే ప్రతి పనిలో నిజాయతీ ఉన్న ఏకైక స్టార్ పవర్ స్టార్. కష్టాల్లో ఉన్నప్పుడు పంచడమే తెలుసు. ఆ కష్టాల్ని అడ్వాంటేజీగా తీసుకోవడం తెలీదు. అలాంటి వ్యక్తికి అభిమానులే కాదు ప్రతిహీరో అభిమానులు సపోర్ట్ చేయాలి ఈసారి’ అని హైపర్ ఆది పవన్ ని ఆకాశానికెత్తేశాడు.