‘జబర్దస్త్’ షో అంటేనే కాంట్రవర్సీలు కచ్చితంగా ఉంటాయి. కామెడీ స్కిట్స్ ఎంటర్ టైన్ చేస్తుండేసరికి ఎవరు వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదు. అప్పుడప్పుడు మాత్రం కొన్ని కొన్ని వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటాయి. ఇక ఈ షోకి కొత్త యాంకర్ గా సౌమ్యరావు అనే కన్నడ బ్యూటీ ఈ మధ్యే వచ్చింది. రెండు వారాలు గడిపోయాయి. ఆమె మాత్రం తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తోంది. అయితే హైపర్ ఆది మాత్రం ఆమె మరీ ఎక్కువగా రెచ్చిపోతున్నట్లు అనిపిస్తోంది. తాజాగా అలాంటి ఇన్సిడెంటే ఒకటి జరిగింది. ఇప్పుడదే షోపై విమర్శలకు దారి తీసింది. పలువురు నెటిజన్స్ కూడా హైపర్ ఆదిపై విరుచుకుపడుతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘జబర్దస్త్’ షో మొదలైనప్పుడు ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. అందుకు తగ్గట్లే అనసూయని యాంకర్ గా తీసుకొచ్చారు. కెరీర్ ప్రారంభంలో ఆమెపైనా కమెడియన్స్ పలు కామెంట్స్ చేసినప్పటికీ.. మొన్నమొన్నటి వరకు అంటే దాదాపు 9 ఏళ్ల పాటు ‘జబర్దస్త్’లో కొనసాగింది. దీంతో కొన్నాళ్ల పాటు ఆమె బదులు రష్మీ.. రెండు షోలకు యాంకర్ గా చేసింది. ఇక రెండువారాల క్రితం సౌమ్యరావుని యాంకర్ గా తీసుకొచ్చారు. తెలుగు, కన్నడ సీరియల్స్ చేస్తున్న ఈమె.. కొన్నాళ్ల క్రితం ఓ ప్రోగ్రామ్ ద్వారా బాగా పాపులర్ అయింది. హైపర్ ఆదిపై వరస పంచులేసింది. ఈ క్రమంలోనే ఆమెని తీసుకొచ్చి, యాంకర్ సీట్లో కూర్చోబెట్టారు.
గత రెండు వారాలు ప్రసారమైన ఎపిసోడ్స్ లో సౌమ్యరావు కొంతమేర ఆకట్టుకుంది. అయితే ఆమెపై హైపర్ ఆది రెచ్చిపోయి మరీ కామెంట్స్ చేస్తున్నాడు. సౌమ్య ఫస్ట్ ఎపిసోడ్ లోనే సౌమ్య, సేమియా అని ప్రాసతో రెచ్చిపోయిన ఆది.. రాబోయే ఎపిసోడ్ లో కూడా అంతకు మించిచేసినట్లు కనిపిస్తున్నాడు. తాజాగా రిలీజ్ ప్రోమో చూస్తుంటే అదే అనిపిస్తోంది. ‘అందరూ చనిపోయి ప్రపంచంలో మీరిద్దరే మిగిలితే ఏం చేస్తారు’ అని జడ్జి కృష్ణ భగవాన్.. హైపర్ ఆది, సౌమ్యని ఉద్దేశించి అన్నాడు. దీనిపై మాట్లాడిన హైపర్ ఆది.. తామిద్దరం కలిసి ఓ ప్రపంచాన్నే సృష్టిస్తాం, వరసగా ఒకరి తర్వాత మరొకరిని కంటాం అని అన్నాడు. ఈ కామెంట్ కి ఎలా రెస్పాండ్ కావాలో తెలీక.. పక్కనే ఉన్న సౌమ్య తలదించేసుకుంది. ఈ క్రమంలోనే నెటిజన్స్ ఆది తీరుపై కామెంట్స్ చేస్తున్నారు.