కొన్ని రోజుల క్రితం వరకు సీనియర్ నటుడు నరేష్-పవిత్రా లోకేష్‌ల గురించి మీడియా, సోషల్ మీడియాలో బోలేడు కథనాలు. ఇక నరేష్‌కి, ఆయన మూడో భార్యకి మధ్య అయితే ఏకంగా మాటల యుద్ధమే నడిచింది. హద్దు దాటి మరీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. తనకు విడాకులు ఇవ్వకుండానే నరేష్.. పవిత్రా లోకేష్‌ని వివాహం చేసుకున్నారని రమ్య ఆరోపించగా.. తన మూడో భార్య వ్యక్తిత్వం మంచిది కాదని.. ఎనిమిదేళ్ల క్రితమే ఆమెకు విడాకులు ఇచ్చానని నరేష్ ఆరోపించాడు. వీరి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. కర్ణాటకకు కూడా పాకింది. మధ్యలో పవిత్రా లోకేష్ భర్త.. కామెంట్స్ వైరలయ్యాయి. ప్రస్తుతానికైతే ఈ వివాదం సద్దుమణిగినట్లే ఉంది. అయితే వీరి వ్యవహారంపై తాజాగా హైపర్ ఆది శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.
ట్రెండింగ్ టాపిక్స్ ఎంచుకుంటూ స్కిట్స్ చేసే హైపర్ ఆది.. ఈ సారి నరేష్-పవిత్ర లోకేష్ ఇష్యూనే టార్గెట్ చేశాడు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో నరేష్-పవిత్రల రిలేషన్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు ఆది. నరేష్ పవిత్రల పేర్లతో తనదైన స్టైల్ కౌంటర్లు వేశాడు. దీంతో ఈ సీన్ వైరల్‌గా మారింది. ప్రస్తుతం జబర్దస్త్ షోలో నరేష్, పవిత్రలు కూడా ఉన్న సంగతి తెలిసిందే. పొట్టి నరేష్, పొట్టి పవిత్రల మీద కౌంటర్లు వేస్తూనే.. పరోక్షంగా నటుడు నరేష్ పవిత్ర లోకేష్‌లను కూడా లాగేశాడు హైపర్ ఆది. శ్రీదేవీ డ్రామా కంపెనీ ఆదివారం నాటి ఎపిసోడ్‌లో ఈ సీన్ కనిపించింది.
శ్రీదేవీ డ్రామా కంపెనీ ఆదివారం నాటి ఎపిసోడ్‌లో అందరూ జోడిలుగా వచ్చారు. ఆది, రాం ప్రసాద్‌ల మధ్య కాలెండర్ లాంచ్ విషయంలో గొడవ రావడంతో.. తమకు సపోర్ట్ చేసే ఆర్టిస్టులను పిల్చుకున్నారు. ఇందులో పరదేశీ, నూకరాజు, ప్రవీణ్ వంటి వారు జోడిలతో ఎంట్రీ ఇచ్చారు. ఇక నరేష్ విషయం రావడంతో.. పవిత్ర ముందుకు వస్తుంది. నరేష్‌కు నేను ఉన్నాను అని పవిత్ర అంటుంది.. దీంతో ఆది ఎంట్రీ ఇచ్చి పంచ్ వేస్తాడు. నీ పేరేంటి అని పవిత్రను అడుగుతాడు ఆది. పవిత్ర అని ఆన్సర్ ఇస్తుంది.. వాడి పేరు ఏంటి అని ఆది అడుగుతాడు. నరేష్ అని చెబుతుంది పవిత్ర.ఇంకేం అన్నట్టుగా ఆది మొహంపెట్టేసి సైలెంట్ అవుతాడు.
అయితే ఆది వేసిన పంచ్ ముందు ఎవ్వరికీ ఏం అర్థం కాక అలా చూస్తుంటే.. పవిత్ర నరేష్ అని అంటున్నాడని పంచ్ ప్రసాద్ క్లారిటీ ఇస్తాడు. దీంతో అందరూ పగలబడి నవ్వేస్తారు. అసలే ఆది ఎక్కువగా ట్రెండ్‌లో ఉన్న టాపిక్స్ మీద కౌంటర్లు వేస్తుంటాడన్న సంగతి తెలిసిందే. దాంతో ఈ సారి పవిత్రా లోకేష్, నరేష్‌లను టార్గెట్ చేసి.. సెటైర్స్ పేల్చాడు ఆది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.