Hyper Aadi: తెలుగు బుల్లితెరలో ‘జబర్థస్త్’ తర్వాత అంత పేరు తెచ్చుకున్న ఎంటర్‌టైన్‌మెంట్ షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’. ‘జబర్థస్త్’ నిర్మాతలనుంచి వచ్చిన షో కావటంతో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఈ షోకు ప్రముఖ యాంకర్ రష్మి వ్యాఖ్యాతగా వ్యవహిరిస్తున్నారు. ఈ షో హైపర్ ఆది వన్ మ్యాన్ షోగా ముందుకు సాగుతోంది. ఆది పంచులు షోను వేరే లెవెల్‌కు తీసుకుపోతున్నాయి. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ప్రోమో మొత్తం ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. అయితే, ప్రోమో చివర్లో హైపర్ ఆది ఎమోషనల్ అయ్యాడు.
తోటి కంటెస్టెంట్లు చేసిన పనికి కంటతడి పెట్టుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. షోలో భాగంగా అక్కడి వారికి ఓ టాస్క్ లాంటిది ఇచ్చారు. ఈ టాస్క్‌లో కొంతమంది ఫొటోలు స్టేజిమీద ఉన్న టేబుల్‌పై పెట్టారు. స్టేజిమీదకు వచ్చిన వారు ఆ ఫొటోలలో ఎవరైతే నచ్చలేదో.. వారి ఫొటోలు తగలబెట్టటం కానీ, చింపేయటం కానీ చేయొచ్చు. ‘ ఒక విషయంలో పర్సనల్‌గా హర్ట్ అయ్యా’ అంటూ ఆటో రామ్ ప్రసాద్.. ‘‘ నాకు అన్నీ హైపర్ ఆదే అని చెప్తాను. కానీ, ఒక రీజన్ వల్ల ఇలా చేయాల్సి వస్తోంది’ అంటూ పరదేశి.
‘నేను షోకు మొదట వచ్చినపుడు.. ఎప్పుడు వచ్చావు అని కాకుండా.. ఎప్పుడు వెళ్లిపోతావు’ అని అడిగావు అందుకే..’’ అంటూ రష్మి హైపర్ ఆది ఫొటోను టార్గెట్ చేశారు. దీంతో హైపర్ ఆది కంట తడి పెట్టుకున్నాడు. తర్వాత స్టేజిమీదకు వెళ్లి ఓ ఫొటోను చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ ఫొటో ఎవరిది? అని తెలియాలంటే ఆదివారం వరకు వేచిచూడాల్సిందే. మరి, ఈ ప్రోమోపై అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వీడియో: హనీమూన్ గురించి పూర్ణను అడిగిన హైపర్ ఆది.. ఆమె ఏమందంటే?