Hyderabad: ఓ టాలీవుడ్ నటిపై ఓ వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు ఆమెను ఇబ్బందులకు గురిచేశాడు. తనతో సహజీవనం చేయాలని బెదిరించసాగాడు. ఈ నేపథ్యంలో సదరు నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల ఫిర్యాదులో నటి పేర్కొన్న వివరాల మేరకు.. అమీర్‌పేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న ఓ నటికి ప్రవీణ్ ఫ్యామిలీ ఫ్రెండ్. పదేళ్లకు పైగా అతడు తెలుసు. ప్రవీణ్ భవనాలు నిర్మించే బిల్డర్. ఎనిమిదేళ్ల క్రితం తనకు డబ్బు కావాలని ప్రవీణ్ అడగటంతో దాదాపు 47 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చింది.
ఇందులో కేవలం తన డబ్బులు మాత్రమే కాకుండా.. తన అపార్ట్‌మెంట్‌లో ఉండే మరో మహిళ దగ్గర కూడా డబ్బులు తీసుకుని ప్రవీణ్‌కు ఇచ్చింది. ఏళ్లు గడుస్తున్నా.. ప్రవీణ్ తాను తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదు. డబ్బులు అడిగితే నటిపైనే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆమె ఒత్తిడి తేవటంతో బెదిరింపులకు దిగాడు.
అసభ్యకరంగా మెసేజ్‌లు చేయసాగాడు. తనతో సహజీవనం చేయాలని ఒత్తిడి తీసుకుని వచ్చాడు. ఈ నేపథ్యంలో విసిగిపోయిన నటి పోలీసులను ఆశ్రయించింది. ప్రవీణ్‌పై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Sai Priya Missing: RK బీచ్ నుండి బెంగళూరులో పెళ్లి వరకు ! సాయి ప్రియ కంప్లీట్ స్కెచ్ ఇదే!