ఇండస్ట్రీలో వరుస విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆట డ్యాన్స్ రియాలిటీ షో ఫస్ట్ సీజన్ విన్నర్ టీనా మృతి చెందింది. ఓంకార్ నిర్వహించిన ఆట డ్యాన్స్ షోతో టీనా చాలా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత సీజన్ 4కి జడ్జిగా కూడా వ్యవహించిన సంగతి తెలిసిందే. టీనా సాధు మృతి చెందినట్లు ఆట సందీప్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించాడు. కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న టీనా గోవాలో రఘు అనే వ్యక్తిని వివాహం చేసుకుని అక్కడే నివసిస్తోంది. అయితే టీనా ఇంత ఆకస్మాత్తుగా మృతి చెందడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ఫస్ట్ డే కలెక్షన్స్.. మహేష్ కెరీర్‌లోనే హయ్యెస్ట్!
ఈ క్రమంలో టీనాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే.. నాలుగైదు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చిన టీనా, యాంకర్ శిల్పాచక్రవర్తిని కలిసిందని, తిరిగి డ్యాన్స్ షోల్లో రీఎంట్రీ ఇవ్వాలని ఉందని మనసులోని మాట బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత గోవా వెళ్లిపోయిన ఆమె ఇంట్లో ఉన్న సమయంలో మద్యం సేవించిందని, అయితే ఎక్కువ మోతాదులో మద్యం తీసుకోవడం వల్ల ఆమెకు గుండెపోటు వచ్చిందని కుటుంబీకులు తెలుపుతున్నట్లుగా ఓ వార్త వైరల్‌గా మారింది. మరి ఇదెంతవరకు నిజమో తెలియాలంటే.. ఆమె కుటుంబ సభ్యులు దీనిపై స్పందించాలి. ఇక టీనా సోషల్ మీడియాలో చివరిసారిగా షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Tina Sadhu: ఆట టైటిల్ విన్నర్ టీనా మృతిపై అనుమానాలు! సహజ మరణమేనా?