గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ సీనీ నటులు, దర్శక, నిర్మాతలు.. వారి కుటుంబ సభ్యులు కన్నుమూస్తున్నారు. ప్రముఖ బాలీవుడు నటుడు హృతిక్ రోషన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన అమ్మమ్మ పద్మా రాణి ఓంప్రకాశ్ కన్నుమూశారు. ముంబైలో గత కొంత కాలంగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.
హృతిక్ రోషన్ తల్లి పింకి మాతృమూర్తి పద్మారాణి. అంతేకాదు ప్రముఖ నిర్మాత ఓం ప్రకాష్ సతీమణి. వయసు సంబంధిత సమస్యల కారణంగా కొన్నేళ్లుగా ఆమె తన కూతురు పింకీ రోషన్‌తో కలిసి జీవిస్తోంది. హృతిక్ రోషన్ తల్లి పింకీ రోషన్ ‘నా తల్లి పద్మా రాణి ఓంప్రకాష్ నా తండ్రిని కలవడానికి మమ్మల్ని విడిచిపెట్టారు. ’ అంటూ తన ఇన్ స్ట్రాలో పోస్ట్ చేసింది. హృతిక్ రోషన్ ఎక్కువ శాతం వాళ్ల అమ్మమ్మ ఇంటి వద్దనే పెరిగాడు. తాత నిర్మత కావడంతో సినిమాలపై మోజు పెంచుకున్నాడు.
హృతిక్ రోషన్ తాతయ్య ఓం ప్రకాష్ తన 93 సంవత్సరాల వయస్సులో ఆగష్టు 7, 2019న కన్నుమూశారు. బాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే బాల నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే ఫిలింఫేర్ ఉత్తమ నటుడు, ఉత్తమ నటుడు డెబ్యూ పురస్కారాలు అందుకున్నాడు. హృతిక్ రోషన్ అమ్మమ్మ కన్నుమూసిన విషయం తెలుసుకొని పలువురు బాలీవుడ్ తారలు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.