Hrithik Roshan: బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ కండలు తిరిగిన దేహంతో భారీగా కనిపిస్తారు. ఆయన దేహమే కాదు.. మనసు కూడా భారీగా ఉంటుంది. తను పెద్ద స్టార్ అన్న గర్వానికి ఆయన ఆమడ దూరంలో ఉంటారు. అందర్నీ ఎంతో చక్కగా ట్రీట్ చేస్తారు. ముఖ్యంగా ఫ్యాన్స్ విషయంలో చాలా సాఫ్ట్‌గా ఉంటారు. వారితో ఫ్రెండ్లీగా నడుచుకుంటారు. ఇందుకు తాజాగా జరిగిన ఓ సంఘటన ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. శనివారం హృతిక్ రోషన్ ఓ ఫిట్‌నెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హృతిక్ ఫ్యాన్స్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఓ ఫ్యాన్ హృతిక్ దగ్గరకు వచ్చాడు. ఆ వెంటనే ఆయన కాళ్లకు దండం పెట్టాడు. హృతిక్ వెను వెంటనే స్పందించారు. ఆయన తిరిగి ఫ్యాన్ కాళ్లకు దండం పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు, ఫ్యాన్స్ ‘‘ అది హృతిక్ రోషన్ మంచితనం అంటే..’’.. ‘‘హృతిక్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం కలవాడు’’.. ‘‘ అలా ఉంటాడు కాబట్టే ఫ్యాన్స్ ఆయన్ని సూపర్ స్టార్ అంటారు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక, హృతిక్ రోషన్ నటించిన తాజా చిత్రం ‘‘విక్రమ్ వేద’’ విడుదలకు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా 2017లో వచ్చిన తమిళ సినిమా ‘విక్రమ్ వేద’కు రీమేక్‌గా తెరకెక్కింది. తమిళంలో మాధవన్ చేసిన పాత్రను హిందీలో సైఫ్ అలీ ఖాన్ చేశారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. మరి, హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరో అభిమాని కాళ్లు మొక్కటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Director Bobby: ప్రముఖ డైరెక్టర్ బాబి ఇంట్లో తీవ్ర విషాదం!