KGF… సినీ వీరాభిమానుల నుంచి.. సగటు ప్రేక్షకుల వరకు ప్రస్తుతం ప్రతి ఒక్కరి నోటా ఇదే మాట వినిపిస్తుంది. అవును మరీ.. చాప్టర్ 1 అసలు ఎలాంటి భారీ అంచనాలు లేకుండా.. ఏదో డబ్బింగ్ సినిమాలా వచ్చి.. రికార్డులు క్రియేట్ చేసింది. దాంతో చాప్టర్ 2 కోసం జనాలు ఇన్నేళ్లు ఆత్రంగా ఎదురు చూశారు. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా.. దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఫుల్ మీల్స్ వడ్డించి.. అభిమానుల సినిమా ఆకలి తీర్చాడు. ఇక KGF కొల్లగొడుతున్న రికార్డులు.. సృష్టించబోయే ప్రభంజనాల గురించి అయితే బొలేడు కథనాలు వెలువడుతున్నాయి.
వీటన్నింటి నేపథ్యంలో ఓ యువకుడి గురించి ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అదే KGF చాప్టర్ 2 ఎడిటర్. అతడి గురించి వివరాలు తెలుసుకున్న కొద్ది.. ఆశ్చర్యంతో విస్తుపోతున్నారు. ఎందుకంటే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని.. కేవలం ఫ్యాన్ పేజ్ వీడియోలు ఎడిట్ చేసే కుర్రాడి ప్రతిభను నమ్మిన ప్రశాంత్ నీల్ KGF వంటి భారీ ప్రాజెక్ట్‌ను అప్పగించి.. సక్సెస్ అయ్యాడు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు కేజీఎఫ్ చాప్టర్ 2 ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి గురించే చర్చించుకుంటున్నారు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: KGF 1,2,3 కాదు.. మొత్తం 12 చాప్టర్లంటా!
KGF చాప్టర్ 2 ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి. వయసు 19 సంవత్సరాలు. ఓ వైపు చదువుకుంటూనే.. మరోవైపు షార్ట్ ఫిల్మ్స్ తీయడం, ఫ్యాన్ పేజ్ వీడియోలు క్రియేట్ చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే ఓ సారి కేజీఎప్ పార్ట్ 1 ఫ్యాన్ వీడియో ఎడిట్ చేశాడు. అది అభిమానులకు తెగ నచ్చింది. విషయం కాస్త దర్శకుడు ప్రశాంత్ నీల్ దృష్టికి వచ్చింది. కేజీఎఫ్ పార్ట్ 1 ఫ్యాన్ వీడియో చూసి ఫిదా అయ్యాడు ప్రశాంత్ నీల్. వెంటనే ఉజ్వల్ కులకర్ణి వివరాలు.. సేకరించి.. అతడికి కబురు పెట్టాడు. ప్రశాంత్ నీల్ దగ్గర నుంచి పిలుపు అనగానే మనోడు గాల్లో తెలిపోయాడు. ఆలస్యం చేయకుండా ప్రశాంత్ నీల్ దగ్గర వాలిపోయాడు. ఉజ్వల్‌ని పరీక్షించిన ప్రశాంత్ నీల్.. KGF పార్ట్ 2 కొన్ని బిట్లు ఇచ్చి.. టీజర్ కట్ చేయ్.. నచ్చితే దాన్ని రిలీజ్ చేస్తాను అన్నాడు.
What you see in the photo?#PrashanthNeel with a young fan..
Nope…He’s #UjwalKulkarni, 19 years old and he is the Editor of #KGFChapter2 movie…😲😎 pic.twitter.com/fANtr2tEw5
— The Illusionist (@JamesKL95) April 11, 2022
ఇది కూడా చదవండి: ఆ వయసు నుంచే శారీరక సమస్యలు.. చనిపోవాలనుకున్నాను: ఇలియానా
ఉజ్వల్ సంతోషంగా అంగీకరించి.. ఆ బిట్లను టీజర్‌గా కట్ చేసి ఇచ్చాడు. అది ప్రశాంత్‌కు విపరీతంగా నచ్చింది. చెప్పినట్లుగానే.. దాన్నే టీజర్‌గా రిలీజ్ చేశాడు. వెంటనే KGF చాప్టర్ 2కి ఉజ్వల్‌ని ఎడిటర్‌గా ప్రకటించాడు. అయితే నిర్మాతలు ప్రశాంత్ నిర్ణయం పట్ల సందేహం వ్యక్తం చేశారు. ఎలాగోలా వారిని ఒప్పించాడు ప్రశాంత్ నీల్. కేవలం తన ఫ్యాన్ పేజ్ వీడియోలు చూసి.. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు ప్రశాంత్‌కు ధన్యవాదాలు తెలిపాడు ఉజ్వల్ కులకర్ణి. తనపై దర్శకుడు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఎంతో చక్కగా తన బాధ్యతలు నిర్వర్తించాడు. రిజల్ట్.. థియేటర్లలో ఈలలు, కేకలు.. రికార్డుల మోత.
ఇది కూడా చదవండి: సీనియర్ నటుడు మురళీ మోహన్ హోం టూర్..
సినిమా భారీ విజయంలో ఉజ్వల్ కులకర్ణి కీలక పాత్ర పోషించాడు. అతడి ప్రతిభకు గొప్ప గొప్ప దర్శకులు ఆశ్చర్యపోతున్నారు. అతడితో వర్క్ చేయడం కోసం క్యూ కడుతున్నారు. ఉజ్వల్ గురించి ప్రస్తుతం ఎన్నో కథనాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అవి చూసిన అభిమానులు.. ఉజ్వల్ నిజంగానే నీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని కామెంట్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఉజ్వల్ ఎడిట్ చేసిన కేజీఎఫ్ 1 ఫాన్ వీడియో ఇక్కడ మీ కోసం.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.