స్టార్ హీరోయిన్ హనీరోజ్ ఒక కిస్ కోసం భారీ రిస్క్ చేశారు. ఆ అనుభవాన్ని సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌తో పంచుకున్నారామె.
హనీరోజ్.. ఒక్క సినిమాతోనే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయిన తార. ఎన్ని చిత్రాల్లో నటించినా, ఎన్ని ఇండస్ట్రీల్లో పనిచేసినా రాని ఫేమ్, క్రేజ్ ఒకే సినిమాతో సొంతం చేసుకున్నారామె. నందమూరి నటసింహం బాలకృష్ణ సరసన నటించిన ‘వీరసింహారెడ్డి’ మూవీతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నారు హనీరోజ్. ఈ ఫిల్మ్‌తో ఆమె తెలుగు నాట ఓవర్‌నైట్ స్టార్డమ్ సొంతం చేసుకున్నారు. అందంతో పాటు యాక్టింగ్‌లోనూ అదరగొట్టిన హనీకి యూత్‌లో మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే పోస్టుల కోసం ఎంతో మంది ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అప్పుడప్పుడు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌లో మెరుస్తున్న హనీరోజ్.. తన అందంతో కుర్రకారును కిర్రెక్కిస్తున్నారు. ఈ భామ నుంచి నెక్స్ట్ మూవీ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ కళ్లలో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పట్లో ఆమె వెండితెర మీద కనిపించే సూచనలు పెద్దగా కనిపించడం లేదు.
‘వీరసింహారెడ్డి’తో హనీరోజ్‌కు తెలుగు నాట మంచి క్రేజ్ దక్కినా సినీ అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు. దీంతో ఆమె నుంచి తర్వాతి చిత్రం కోసం మరికొన్నాళ్లు ఆగక తప్పని పరిస్థితి. అప్పటిదాకా సోషల్ మీడియాలో హనీని ఫాలో అవుతూ, ఆమె పెట్టే అప్డేట్స్ను చూస్తూ ఎంజాయ్ చేయాల్సిందే. ఇదిలా ఉంటే.. హనీరోజ్ చేసిన ఒక భారీ రిస్క్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారింది. ఇటీవల ఐర్లాండ్ టూర్‌కు వెళ్లిన ఈ తేనెకళ్ల బ్యూటీ.. ఆ కంట్రీలో ఎంతో ప్రసిద్ధి గాంచిన బ్లర్నే స్టోన్ (బ్లర్నే అనే రాయి)ను రిస్క్ చేసి మరీ ముద్దు పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఆమె చాలా ఎత్తులో పడుకొని.. తన తలను బాగా వెనక్కి వాల్చి మరీ ఆ రాయిని ముద్దాడారు. ఈ అనుభవాన్ని మర్చిపోలేనని.. ఇదొక వండర్ఫుల్ ఎక్స్‌పీరియెన్స్ అని చెప్పుకొచ్చారు హనీరోజ్. రాయిని ముద్దాడుతూ హనీ చేసిన రిస్కీ వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది.