సినిమా ప్రమోషన్స్ అనేవి సినిమా కోసం.. మరి బయట ప్రమోషన్స్.. మనీ కోసం చేస్తుంటారు. సినీతారల ప్రమోషన్స్ అంటే సినిమాలలోనే కాదు.. బయట కూడా బాగా పాపులర్ అవుతుంటాయి. ఈ విషయంలో లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషన్ హనీ రోజ్ ని గ్యాప్ లేకుండా బుక్ చేసుకుంటున్నారు వ్యాపారవేత్తలు. వీరసింహారెడ్డి మూవీ తర్వాత హనీ రోజ్ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
సినీతారల ప్రమోషన్స్ అంటే సినిమాలలోనే కాదు.. బయట కూడా బాగా పాపులర్ అవుతుంటాయి. సినిమా ప్రమోషన్స్ అనేవి సినిమా కోసం.. మరి బయట ప్రమోషన్స్.. మనీ కోసం చేస్తుంటారు. ఈ విషయంలో లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషన్ హనీ రోజ్ ని గ్యాప్ లేకుండా బుక్ చేసుకుంటున్నారు షాపింగ్ మాల్స్ వ్యాపారవేత్తలు. అవును.. వీరసింహారెడ్డి మూవీ తర్వాత హనీ రోజ్ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేరళకు చెందిన ఈ భామ.. వీరసింహారెడ్డిలో బాలయ్యకి భార్యగా, తల్లిగా నటించి మెప్పించింది. గతంలో ఆలయం, ఈ వర్షం సాక్షిగా అంటూ తెలుగు సినిమాలు చేసినప్పటికీ.. సినిమాలు ప్లాప్ అవ్వడంతో హనీ తిరిగి మలయాళం వైపు వెళ్ళిపోయింది.
దాదాపు 8 ఏళ్ళ గ్యాప్ తర్వాత వీరసింహారెడ్డితో టాలీవుడ్ రీఎంట్రీ చేసింది. అప్పుడంటే.. కెరీర్ ప్రారంభం కాబట్టి.. పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. కానీ.. కొన్నాళ్లుగా మలయాళంలో స్టార్ హీరోయిన్.. ఇప్పుడు తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. హనీ రోజ్ పేరు వినిపించినా.. సోషల్ మీడియాలో ఆమె రూపు కనిపించినా అలర్ట్ అయిపోతున్నారు సినీ ప్రేమికులు. వీరసింహారెడ్డితో గుర్తింపు సంపాదించుకున్న ఈ భామకు తెలుగులో అవకాశాలు క్యూ కడుతున్నాయట. కానీ.. ఈసారి ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదని ఆచితూచి కథలు వింటోందట. ఇక సినిమాలే కాకుండా హనీ రోజ్.. షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ లో కూడా దూసుకుపోతోంది.
ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న హీరోయిన్స్ కి షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ ఆఫర్స్ రావడం మామూలే. కానీ.. హనీ రోజ్ క్రేజ్ వేరు అంటున్నారు ఫ్యాన్స్. ఆల్రెడీ తెలుగు రాష్ట్రాలలో కొన్ని షాపింగ్ మాల్స్ కి రిబ్బన్ కట్ చేసింది ఈ భామ. ఇప్పుడు ఖమ్మంలో మరో ముగ్ధ అనే మరో షాపింగ్ మాల్ కి రిబ్బన్ కట్ చేసేందుకు రెడీ అయిపోయింది. దీనికోసం అమ్మడు అమౌంట్ కూడా గట్టిగానే పుచ్చుకుందని సమాచారం. హనీ రోజ్ ప్రస్తుతం.. తనకు వచ్చిన క్రేజ్ ని బాగా క్యాష్ చేసుకుంటోంది. అందుకు తగినట్లుగానే వ్యాపారవేత్తలు కొత్తగా ఓపెనింగ్స్ ఏమైనా ఉంటే హనీతో చేయించాలనే ఆలోచన చేస్తున్నారట. దీంతో సినిమాలే కాదు.. అమ్మడిని యాడ్స్ పరంగాను గట్టిగానే వాడేస్తున్నారని నెటిజన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి హనీ రోజ్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.