ఉపవాసం ఉండడం అనేది హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాచారాల్లో ఒక భాగం. ఉపవాసం ఉండడం అనేది మూఢనమ్మకం కాదు. దాని వెనుక సైన్స్ ఉంది. ఏడాది మొత్తం కడుపులోకి పొలోమని కంటికి కనబడిన ప్రతి పదార్థాన్ని పంపించేస్తాం. కడుపుకి కూడా విశ్రాంతి ఉండాలి కదా. జీర్ణవ్యవస్థకు, జీర్ణక్రియకు విశ్రాంతి అనేది ఇవ్వాలి. అందుకోసమే పండగలప్పుడు ఉపవాసం కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. మామూలుగా ఇంటి పక్కనోడో, డాక్టరో, యాక్టరో చెప్తే వినరు. దేవుడి పేరు చెప్తే నోటికి తాళం వేస్తారు. నోటికి తాళం వేస్తేనే కడుపు ఆ ఒక్కరోజైనా ప్రశాంతంగా ఉంటుంది. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇవేమీ తెలియని మూర్ఖులు మూఢనమ్మకాలు అంటూ కొట్టిపడేస్తారు. ఈ కోవలోనే ఒక ప్రముఖ సింగర్ ఉపవాసం ఎందుకు అవసరమా అన్నట్టు వెకిలిగా వ్యాఖ్యలు చేశాడు. అతనెవరంటే?
మతం అనేది జీవన విధానం. మతాన్ని అనుసరించి మనుషులు ఆ జీవన విధానాన్ని అనుసరించి జీవిస్తుంటారు. ఇక్కడ ఎవరినీ ఎవరూ నువ్వెందుకు అలా జీవిస్తున్నావని గానీ, నీ జీవన విధానం ఎందుకు ఇలా ఉందని గానీ ప్రశ్నించే హక్కు లేదు. ఎవరికీ హాని తలపెట్టకుండా తమ పద్ధతులను పాటిస్తూ జీవించే మనుషులు ఏ మతానికి చెందిన వారైనా సరే వారిని కించపరిచే హక్కు ఏ మనిషికీ లేదు. ఆ మత పండుగ వచ్చినప్పుడు ఆ పండుగకు తగ్గట్టు ఆ వ్యక్తి వ్యవహరిస్తారు. కాబట్టి వారు ఆచరించే పద్ధతిని తప్పుబట్టకూడదు. తాజాగా ఒక ప్రముఖ సింగర్ ముస్లిం వారు అనుసరించే పద్ధతిని కించేపరిచే వ్యాఖ్యలు చేశాడు.
రంజాన్ మాసం కావడంతో ముస్లిం సోదరి, సోదరీమణులు ఉపవాసం పాటించడం అనేది ఒక సంప్రదాయం. ఈ సంప్రదాయంపై హాలీవుడ్ సింగర్ జస్టిన్ బీబర్ దంపతులు అవమానకర వ్యాఖ్యలు చేశారు. తాము ఎప్పుడూ ఉపవాసం ఉండలేదని, తమ శరీరాలకు పోషకాలు కావాలని, అందుకే ఎప్పుడూ కూడా ఉపవాసం ఆలోచన కూడా చేయమని అన్నారు. అయినా కడుపు మాడ్చుకుని ఉపవాసం ఉండడం ఏమిటో ఇప్పటికీ అర్ధం కాదని.. అంతగా ఉండాలి అనుకుంటే టీవీ చూడ్డం, సెల్ ఫోన్ వాడడం మానేయండని.. తెలివి తక్కువ వాళ్ళలా తిండి మానేయడం ఏమిటని వెకిలిగా మాట్లాడారు. దీనిపై బాలీవుడ్ నటి గౌహర్ ఖాన్ స్పందించారు. జస్టిన్ బీబర్ దంపతులు ఉపవాసం గురించి వెకిలిగా మాట్లాడిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేస్తూ ఘాటుగా బదులిచ్చారు. వాళ్ళు ఎంత డంబ్ గా ఉన్నారో ఈ వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయని ఆమె అన్నారు.
ఉపవాసం వెనుక ఉన్న సైన్స్ గురించి, ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు కొంచెమైనా తెలుసా? ముందు దాని గురించి తెలుసుకోండి. మీకంటూ ఒక అభిప్రాయం ఉండడం తప్పు కాదు. కానీ ఆ అభిప్రాయాన్ని సరిగా వ్యక్తపరిచే తెలివి కూడా ఉండాలి అంటూ గౌహర్ ఖాన్ చురకలు అంటించారు. గౌహర్ ఖాన్ వ్యాఖ్యలకు నెటిజన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఉపవాసం అనేది సైన్స్ తో ముడిపడి ఉన్న అంశమని, మూర్ఖులకు అది అర్థం కాదని కామెంట్స్ చేస్తున్నారు. ఇక గౌహర్ ఖాన్ త్వరలో తల్లి కాబోతున్నారు. రంజాన్ మాసం కాబట్టి ఉపవాసం ఉంటున్నారా అని అభిమానులు సందేహం వ్యక్తం చేయడంతో ఆమె స్పందించారు. గర్భంతో ఉండడం వల్ల ఈ ఏడాది రంజాన్ మాసంలో ఉపవాసం ఉండడం లేదని.. అయితే దానికి బదులు రంజాన్ నెల మొత్తం నిరుపేదల ఆకలి తీర్చాలని నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించారు. మరి ఉపవాసం గురించి వెకిలిగా వ్యాఖ్యలు చేసిన హాలీవుడ్ సింగర్ జస్టిన్ బీబర్ దంపతులకు చురకలు అంటించిన మన భారతీయ నటిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.