ఎన్టీఆర్ తో కలిసి పనిచేసేందుకు ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ రెడీ అయిపోయాడు. 'ఆర్ఆర్ఆర్'లోని ఆ సీన్ లో తెగ నచ్చేశాడని ప్రశంసించాడు. ఇంతకీ ఏంటి విషయం?
తెలుగు సినిమాకు ఆస్కార్ రావడం అనేది ఓ కల. దాన్ని రియాలిటీలో ప్రూవ్ చేసింది ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీ గురించి కేవలం మన దేశంలోనే కాదు హాలీవుడ్ లోనూ తెగ మాట్లాడుకున్నారు. స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ లాంటి డైరెక్టర్స్ కూడా ‘ఆర్ఆర్ఆర్’ని మెచ్చుకున్నారు. ఇందులో లీడ్ రోల్స్ చేసిన ఎన్టీఆర్, రామ్ చరణ్.. గ్లోబల్ స్టార్స్ అయిపోయారు. వీళ్లకు హాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయని అన్నారు. కానీ అందులో నిజమెంత అనేది తెలియదు. బట్ ఇప్పుడు ఏకంగా ఓ హాలీవుడ్ డైరెక్టరే.. ఎన్టీఆర్ కి బంపర్ ఆఫర్ ఇచ్చారు. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
అసలు విషయానికొస్తే.. మనలో మనం చెప్పుకుంటే ‘ఆర్ఆర్ఆర్’ గొప్ప సినిమాయేం కాదు. అయినా సరే ఫారెన్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. ఆ సెంటిమెంట్, ఫైట్స్, మరీ ముఖ్యంగా ఆస్కార్ తెచ్చిపెట్టిన ‘నాటు నాటు’ సాంగ్.. దీనికి తోడు ఎన్టీఆర్-రామ్ చరణ్ యాక్టింగ్ కి అందరూ ఫుల్ గా ఫిదా అయిపోయారు. ఆ మధ్య రామ్ చరణ్.. ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ తనకు హాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నాయని చెప్పాడు. ఎన్టీఆర్ కి కూడా వస్తున్నాయని అన్నారు. కానీ ఇప్పుడు హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ గన్.. తారక్ తో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు చెప్పాడు.
‘గార్డియన్ ఆఫ్ ది గ్యాలక్సీ 3’ ప్రమోషన్ లో భాగంగా ప్రముఖ ఛానెల్ లో ఇంటర్వ్యూకి డైరెక్టర్ జేమ్స్ గన్ అటెండ్ అయ్యారు. ఈ సిరీస్ లో ఇండియన్ యాక్టర్ ని పరిచయం చేయాలనకుంటే ఎవరినీ సెలెక్ట్ చేస్తారు? అని జేమ్స్ ని అడగ్గా.. ఎన్టీఆర్ పేరు చెప్పారు. ‘గతేడాది బిగ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీలోని ఓ సీన్ లో బోనులో నుంచి పులులతో బయటకొచ్చే వ్యక్తితో వర్క్ చేయాలని ఉంది. ఏదో ఒకరోజు కచ్చితంగా పనిచేస్తానని అనుకుంటున్నాను. అమేజింగ్-కూల్’ అని చెప్పుకొచ్చాడు. సో అదన్నమాట విషయం. ‘ఆర్ఆర్ఆర్’ ఇంటర్వెల్ సీన్ వల్ల ఏకంగా ఎన్టీఆర్ కి హాలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చేసింది. మరి దీనిపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.