ప్రపంచ వ్యాప్తంగా ‘పైరేట్స్ ఆఫ్ కరేబియన్’ మూవీతో తనకంటూ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్నాడు నటుడు జానీ డెప్. ఆ మద్య తన మాజీ భార్య అంబర్ హార్డ్ మీద పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన విజయం సాధించాడు. తన విజయాన్ని గిటారిస్ట్ జెఫ్ బెక్‌తో కలిసి ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు జానీ డెప్. ఇందుకోసం ఆయన ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లోని ‘వారణాసి’ రెస్టారెంట్‌ను ఎంచుకొన్నారు. పార్టీ జరుగుతున్నంత సేపు రెస్టారెంట్ మొత్తం క్లోజ్ చేశారు.. సాధారణ ప్రజలను అనుమతించలేదు.
ఈ పార్టీలో జానీ డేప్ అతని స్నేహితులు ఇండియన్ వంటకాలతో పాటు కాక్‌టెయిల్స్, రోజీ షాంపెయిన్ వంటివి ఏర్పాటు చేసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు. ఈ విందు కోసం డెప్ 62,000 డాలర్లను ఖర్చు చేశారు. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ.48 లక్షలు. ఇక పార్టీ ఇస్తున్న సమయంలో జానీ డెప్ చాలా ఆనందంగా గడిపారని రెస్టారెంట్ సిబ్బంది తెలిపారు. సిబ్బందితో సెల్ఫీలు దిగారు… వారందరితో ఉల్లాసంగా గడిపారు. జానీ డెప్ చాలా అణుకువ కలిగిన వ్యక్తిగా రెస్టారెంట్ సిబ్బంది అభివర్ణించారు.
ఈ సందర్భంగా రెస్టారెంట్ మేనేజర్ మహమ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ.. ముందుగా జానీ డెప్ తన మిత్రులతో పాటు పార్టీకి వస్తున్నారని తమకు కాల్ చేయగా నమ్మలేదని ‘వారణాసి’ రెస్టారెంట్ మేనేజర్ మహమ్మద్ హుస్సేన్ తెలిపారు. తమ రెస్టారెంట్ లో పార్టీ ఏర్పాటు చేస్తున్న సందర్భంగా జానీ డేప్ కి సంబంధించిన ప్రత్యేక బృందం తమ హూటల్ ని సందర్శించి వెళ్లారని తెలిపారు.
జానీ డేప్ తన స్నేహితులకు ఇచ్చిన విందులో ఎన్నో ప్రత్యక వంటకాలు ఉన్నాయని.. ఆ వంటకాలు తిన్న తర్వాత అతనితో పాటు స్నేహితులు కూడా చాలా ఎంజాయ్ చేశారని అంటున్నారు రెస్టారెంట్ బృందం. ఈ సందర్భంగా జానీ డేప్ తో రెస్టారెంట్ బృందం ఫోటోలు తీసుకున్నారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.