కొద్దికాలంగా ఇండస్ట్రీలో సీక్వెల్స్ హవా నడుస్తోంది. ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవ్వగానే దానికి కొనసాగింపుగా మరో సినిమా వచ్చేస్తోంది. టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధానపాత్రలో హీరో నాని నిర్మించిన సినిమా ‘హిట్ 2‘. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమాను శైలేష్ కొలను తెరకెక్కించాడు. 2020లో వచ్చిన హిట్ మూవీకి సీక్వెల్ గా హిట్ 2 రూపొందింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమాని డిసెంబర్ 2న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి గెస్ట్ గా హిట్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిపారు దర్శకనిర్మాతలు. దీంతో సినిమాకి వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ సాలిడ్ గా జరిగినట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉండగా.. హిట్ 2 సినిమాకి డ్యూరేషన్ బాగా కలిసొచ్చే అంశమనే చెప్పాలి. కేవలం 2 గంటల నిడివితో సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే.. ఇంకా మున్ముందు రావాల్సిన సీక్వెల్స్ ఉన్నాయి. మొత్తం ఏడు భాగాలుగా ప్లాన్ చేస్తున్న ‘హిట్ వర్స్’లో ఒక్కో భాగంలో ఒక్కో హీరో కనిపిస్తాడని అంటున్నారు. అయితే.. హిట్ ఫస్ట్ పార్ట్ విశ్వక్ సేన్ తో మొదలైంది. ఇప్పుడు రెండో భాగంలో అడివి శేష్ నటించాడు. మామూలుగానే అడివి శేష్ చేసే సినిమాలన్నీ థ్రిల్లర్ జానర్ లోనే ఉంటాయి. అంతేగాక తన సినిమాలకు తానే కథాకథనాలు రాసుకుంటాడు శేష్. కేవలం స్క్రిప్ట్ మీద నమ్మకంతో ఈ సినిమాలో హీరోగా మాత్రమే వర్క్ చేశాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది.
రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి రూ. 10 కోట్లు బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 15 కోట్ల వరకు బిజినెస్ జరగగా.. బ్రేక్ ఈవెంట్ టార్గెట్ రూ. 16 కోట్లుగా సెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన హిట్ 2 మూవీ 16 కోట్లు షేర్ రాబట్టాల్సి ఉంది. అంతేగాక.. డిసెంబర్ 2న విడుదలవుతున్న అన్ని సినిమాలను దాటుకొని కలెక్షన్స్ రాబట్టడం అంటే బాక్సాఫీస్ వద్ద సాలిడ్ టాక్ సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సినిమాని హీరో నానితో పాటు ప్రశాంతి తిపర్నేని కూడా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి వరుస హిట్స్ తో దూసుకుపోతున్న హీరో అడివి శేష్.. హిట్ 2 సినిమాతో తన హిట్ల పరంపర కంటిన్యూ చేస్తాడేమో చూడాలి.