ఒక్కప్పుడు టాలీవుడ్ హీరోలు తీసుకుంటున్న పారితోషికం ఇప్పుడు స్టార్ హీరోయిన్ లు ఒక్కో సినిమాకి భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మూడు పదుల వయసు దాటిన చెక్కుచెదరని అందంతో టాలీవుడ్ ముద్దగుమ్మలు సినిమాల మీద సినిమాలు చేస్తూ అత్యధిక పారితోషికాన్నిడిమాండ్ చేస్తూ కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. మరీ ముఖ్యంగా అనుష్క చేయబోయే సినిమాకు భారీ పారితోషికాన్ని డిమాండ్ చేస్తుందట. తను ఒక్కో సినిమాకి రూ. 3 నుంచి 4 కోట్ల వరకు తీసుకుంటుందని సమాచారం.
ఇక టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక మందన సినిమాకి ఏకంగా రూ. 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. కాగా లేడి సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న నయనతార ఒక సినిమా చేయటానికి మాములుగా రూ. 3.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది. పూజ హెగ్డే కూడా తను చేసే సినిమాకి రూ.3.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. ఇక సమంత విషయానికొస్తే తను చేసే సినిమాలను బట్టి ఒక్కో సినిమాకి రూ. 3.5 కోట్ల వరకు తీసుకుంటుంది.
ఇండస్ట్రీకి వచ్చి పదకొండేళ్లు దాటినా ఆగకుండా సినిమాలు చేస్తున్న కాజల్ అగర్వాల్ సైతం ఒక్కో సినిమాకి రూ.2 కోట్లు తీసుకుంటుందని సమాచారం. టాలీవుడ్ లో మిల్కీ బ్యూటీగా పేరు పొందిన తమన్నా ఒక్కో సినిమాకి రూ. 1.75 కోట్ల వరకు తీసుకుంటుంది. కాగా టాలీవుడ్ లోకి ఉప్పెన సినిమాతో అడుగు పెట్టిన కృతి శెట్టి కూడా తన ఒక్కో సినిమాకి దాదాపుగా రూ.2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది. ఇక ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ తను చేసే ఒక్కో సినిమాకి రూ.2 కోట్లు తీసుకుంటుందని తెలుస్తోంది.