ఈ హీరోయిన్ ని చూస్తే టీనేజ్ పిల్లలా ఉంటుంది. కానీ వయసు 35 ఏళ్లు. ఏ ముద్దుగుమ్మకి సాధ్యం కాని విధంగా ఇప్పటికీ జీరో సైజ్ నడుము మెంటైన్ చేస్తూ కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది.
హీరోయిన్స్ కి సినిమా ఛాన్సులు రావాలంటే.. యాక్టింగ్ టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. మంచి పిచ్చెక్కించే ఫిజిక్ కూడా ఉండాలి. అప్పుడే అందరూ వీళ్లని చూస్తారు. ఎగబడి మరి సినిమాలకు వస్తారు. కెరీర్ స్టార్టింగ్ లో అంటే హీరోయిన్లు ఫిట్ ఉంటారు కానీ తర్వాత తర్వాత మెంటైన్ చేయడం చాలా కష్టమైపోతుంది. మరీ ముఖ్యంగా జీరో సైజ్ చాలా చాలా కష్టం. ఈ హీరోయిన్ మాత్రం 35 ఏళ్ల వయసులో సన్నని నడుముతో మెంటలెక్కించేస్తోంది. ఆ పిక్ సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టేశారా? లేదే చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ పిల్ల మహారాష్ట్రలో పుట్టి పెరిగినప్పటికీ సినిమాలు మాత్రం సౌత్ లోనే చేస్తోంది. 2006లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి, స్టిల్ ఇప్పటికీ హీరోయిన్ గా మూవీస్ చేస్తూనే ఉంది. మరికొన్నాళ్లు కూడా ఈ ఊపు ఇలానే కొనసాగించేలా కనిపిస్తోంది. ఆమె పేరు వేదిక. తొలుత మోడలింగ్ చేస్తూ పలు యాడ్స్ లో యాక్ట్ చేసింది. అలా ‘మద్రాసీ’ మూవీతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాతి ఏడాది కల్యాణ్ రామ్ ‘విజయదశమి’ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. చివరగా ‘బంగార్రాజు’ చిన్న అతిథి పాత్రలో అలా మెరిసి ఇలా మాయమైపోయింది.
తెలుగులో బాణం, దగ్గరగా దూరంగా, రూలర్ లాంటి మూవీస్ చేసింది. డబ్బింగ్ మూవీ ‘కాంచన 3’తో తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. ఇలా ఈ రెండు భాషలతో పాటు కన్నడ, మలయాళంలోనూ హీరోయిన్ గా చేస్తూ బిజీబిజీ అయిపోయింది. తాజాగా ఈమె జీరో సైజ్ నడుముతో ఉన్న పిక్ బయటకొచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ఈమె ఏంటి? రోజురోజుకీ ఇంత గ్లామర్ పెంచేస్తోందిరా బాబోయ్ అనుకుంటున్నారు. మరి చిన్నప్పటి ఫొటో చూసి మీలో ఎంతమంది కనిపెట్టారు? కింద కామెంట్ చేయండి.