ఓ హీరోయిన్ కెరీర్ మహా అయితే ఓ పదేళ్లు ఉంటుంది. ఆ తర్వాత ఫేడౌట్ అయిపోతారు. అలాంటిది ఈ బ్యూటీ సేమ్ లుక్ మెంటైన్ చేస్తూ 20 ఏళ్లుగా హిట్స్ కొడుతూనే ఉంది.
ఆమె స్టార్ హీరోయిన్. కుర్రాళ్ల కలలరాణి. గ్లామర్ మెంటైన్ చేయడంలో సూపర్ ఎక్స్ పర్ట్. ఎంతలా అంటే ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎలా ఉందో? ఇప్పటికీ అలానే ఉంది. చెప్పాలంటే వయసుతో పాటు అందాన్ని ఓ రేంజులో పెంచేసుకుంది. పాన్ ఇండియా సినిమాలతో కంట్రీవైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి. చెప్పాలంటే జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. సరే ఇంతలా చెప్పాం కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా? లేదా చెప్పేయమంటారా?
అసలు విషయానికొస్తే.. టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటారు. ఇలాంటప్పుడు ఆల్రెడీ ఉన్న బ్యూటీస్.. నిలబడాలంటే మెరిట్ తోపాటు లక్ కూడా చాలా గట్టిగా ఉండాలి. సినిమా ఛాన్సులు కూడా వస్తూ ఉండాలి. అలా దాదాపు 20 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న అతి కొద్దిమంది హీరోయిన్లలో త్రిష ఒకరు. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఆమెనే. 2003లో ‘నీ మనసు నాకు తెలుసు’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాతి ఏడాది వచ్చిన ‘వర్షం’తో ఒక్కసారిగా స్టార్ అయిపోయింది.
నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, కృష్ణ లాంటి పలు హిట్ సినిమాలతో పాటు యావరేజ్ చిత్రాల్లోనూ హీరోయిన్ గా చేసింది. చాలా ఫేమ్ సంపాదించింది. తెలుగుతో పాటు తమిళంలోనూ హీరోయిన్ గా చేసిన త్రిష కెరీర్.. 2017 టైంలో పూర్తిగా డౌన్ అయిపోయింది. అలాంటప్పుడు వచ్చిన ’96’ మూవీ.. త్రిష కెరీర్ నే టర్న్ చేసింది. పొన్నియన్ సెల్వన్, లియో లాంటి సినిమాలతో తనని బిజీగా మార్చేసింది. హీరోయిన్ పీక్ స్టేజీలో ఉంది. కెరీర్ లో ప్రేమ, రిలేషన్ లాంటివాటితోనూ అప్పట్లో వార్తల్లో నిలిచిందీ బ్యూటీ. సరే ఇదంతా పక్కనబెడితే.. ఈమె చిన్నప్పటి ఫొటో చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.