సినిమా దగ్గర పడితే చాలు.. హడావుడి మొదలైపోతుంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ అని ప్రచారంతో హోరెత్తిస్తుంటారు. ఇక టెక్నాలజీ పెరిగిన తర్వాత అంటే గత కొన్నేళ్ల నుంచి సోషల్ మీడియాలో రిలీజ్ కు ముందు ఎలానూ పబ్లిసిటీ ఉండనే ఉంటుంది. ఇక జనాలకు సినిమా చేరువ కావాలంటే మాత్రం యాక్టర్స్.. ప్రేక్షకుల మధ్య తిరుగుతూ వాళ్లకు దగ్గరవ్వాలి. అప్పుడే మూవీపై అంచనాలు పెరిగి, బజ్ ఏర్పడుతుంది. రిలీజ్ తర్వాత జనాలు వస్తారు. దీనికోసం ఒక్కో చిత్రబృందం ఒక్కోలా పబ్లిసిటీ చేస్తుంది. ఇప్పుడు ‘ధమాకా’ మూవీ టీం కూడా అలాంటి ప్రయత్నమే చేసింది.
ఇక విషయానికొస్తే.. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ధమాకా’. ఈ శుక్రవారం అంటే డిసెంబరు 23న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్.. ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేస్తుంది. సినిమాపై కూడా ఓ మాదిరిగా అంచనాలున్నాయి. రవితేజ హిట్ కొట్టి చాలా రోజులైపోయింది. సో ఈ చిత్రంతో అయినా సరే సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అయితే తాజాగా ఈ సినిమా హీరోయిన్ శ్రీలీల చేసిన పని వైరల్ గా మారింది.
తాజాగా ‘ధమాకా’ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో కాసేపు సందడి చేసింది. అక్కడికి వచ్చిన యూత్ తో కలిసి సరదాగా డ్యాన్స్ కూడా చేసింది. ఇక ‘ధమాకా’ అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ కూడా అమ్మింది. ఏకంగా హీరోయిన్ టికెట్స్ అమ్ముతుండేసరికి.. ఫ్యాన్స్ కౌంటర్ కు క్యూ కట్టారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరితో మాట్లాడిన శ్రీలీల.. ‘ధమాకా’లో మీ ఫేవరెట్ సాంగ్ ఏది? ఆ స్టెప్ వేయండి ఓసారి సరదాగా అంటూ టికెట్స్ అమ్మింది. ఇదిలా ఉండగా ‘పెళ్లి సందD’తో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.. ప్రస్తుతం 8కిపైగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరి చూడాలి ‘ధమాకా’తో ఆమెకు ఏ రేంజ్ హిట్ దక్కుతుందో?
#Dhamaka Gorgeous Beauty @sreeleela14 herself at the ticket counter for first few members to watch
#Dhamaka entertainer on Big screen. ❤️ ✨ #DhamakaFromDec23
Book your tickets 🔗 https://t.co/iZ40p9utmY@RaviTeja_offl @TrinadharaoNak1@vishwaprasadtg @vivekkuchibotla pic.twitter.com/g65TagEwcb
— People Media Factory (@peoplemediafcy) December 17, 2022