‘అమ్మ ఆవకాయ అంజలి.. ఎప్పుడు బోర్ కొట్టవ్’… ఈ ఒక్క డైలాగ్ చాలు. నువ్వే నువ్వే సినిమా ఏంటో మనకు చెప్పడానికి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. దర్శకుడిగా ఫస్ట్ తీసింది ఈ చిత్రమే. అప్పుడే కాదు ఇప్పుడు చూసినా, మరో పదేళ్ల తర్వాత చూసినా సరే ఈ సినిమా ఎప్పుడూ ఫ్రెష్ గానే ఉంటుంది. అందుకు త్రివిక్రమ్ ఓ కారణమైతే.. హీరోహీరోయిన్ తరుణ్, శ్రియ అద్భుతమైన యాక్టింగ్ మరో కారణం. అంతలా ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసిన ఈ సినిమా.. సోమవారంతో 20 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఓ ఈవెంట్ నిర్వహించారు. పాత స్మతుల్ని నెమరవేసుకున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగు సినిమాల్లో ఓ మంచి హాస్యభరిత చిత్రంగా నువ్వే నువ్వే నిలిచింది. ప్రతి సీన్, ప్రతి డైలాగ్ కూడా మనకు ఇప్పటికే గుర్తుండిపోయింది. అలాంటి ఈ చిత్రంలో హీరోయిన్ గా చేసిన శ్రియ.. అప్పటి విషయాల్ని గుర్తుచేసుకుంది. ‘త్రివిక్రమ్, రవికిశోర్ గారు నా కోసం దిల్లీ వచ్చారు. ఈ కథ వినగానే నాకు బాగా నచ్చేసింది. షూటింగ్ చాలా ఎంజాయ్ చేశాను. తరుణ్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఈ సినిమా మర్చిపోలేని జ్ఞాపకం’ అని శ్రియ చెప్పింది. ఇక శ్రియ మాట్లాడుతున్న టైంలో శ్రియలో పెద్దగా మార్పు ఏం రాలేదు. కాకపోతే ఆమెకి పెళ్లయిపోయింది, కూతురు కూడా ఉందని తరుణ్ అన్నాడు. దీంతో పెద్దగా నవ్వేసిన శ్రియ.. తన కోస్టార్ తరుణ్ ని స్టేజీపై అందరూ చూస్తుండగానే ముద్దు పెట్టేసింది. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.
మరోవైపు దర్శకుడిగా తన తొలి సినిమా సంగతుల్ని గుర్తుచేసుకున్న త్రివిక్రమ్ ఆనాటి ముచ్చట్లని నెమరవేసుకున్నారు.’నాలో ఉన్న రచయిత, దర్శకుడిని నా కంటే ఎక్కువగా గుర్తించిన, ఇష్టపడిన వ్యక్తి రవికిశోర్ గారు. ఆయన్ని నేను చాలా ప్రేమిస్తా, గౌరవిస్తా. ఆయన నాకు సోదరుడు లాంటివారు. అలానే ఈ సినిమా కోసం గాలిపటం గగనానిదా? ఎగరేసే నేలదా? అని రాసిన శ్రాస్తిగారి గురించి ఏం చెప్పగలను. ఈ చిత్రాన్ని ఆయనకు నివాళిగా అంకితం ఇస్తున్నాను’ అని త్రివిక్రమ్ చెప్పారు. ఇకపోతే ఇందులో హీరోహీరోయిన్ల నటనతో పాటు సునీల్, ఎమ్మెస్ నారాయణ, ప్రకాశ్ రాజ్, రాజీవ్ కనకాల తదితరులు కూడా కీలకపాత్రలు చేశారు. మనకు గుర్తుండిపోయే ఓ చిత్రాన్ని అందించారు. మరి స్టేజీపై తరుణ్ ని శ్రియ ముద్దు పెట్టడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: తరుణ్ మాటలకు త్రివిక్రమ్ ఎమోషనల్.. ఏడిపించేశాడు!