ఆమెని చూస్తే శిల్పంలా అందంగా ఉంటుంది. సంప్రదాయ చీరకట్టు నుంచి బికినీ వరకు ఏది వేసుకున్నా సరే ఆమెని బీట్ చేస్ బ్యూటీస్ ఎవరూ ఉండరేమో బహుశా! మరి అంత గ్లామరస్ ఒలకబోసే ఆ బ్యూటీ ఎవరో కనుక్కున్నారా?
ఆమె చూడచక్కని ముద్దుగుమ్మ. అందం విషయంలో కుందనపు బొమ్మ. చీరకట్టినా, మోడ్రన్ డ్రస్ వేసినా సరే గ్లామర్ చూపిస్తుంది. పద్ధతిగా ఉండే రోల్స్ తోపాటు హాట్ నెస్ తో రెచ్చిపోయి పిచ్చెక్కించే పాత్రలు కూడా చేసింది. ఆమె ఫొటోలు, వీడియోలు గనుక మీరు చూస్తే.. ‘మేడమ్ సార్ మేడమ్ అంతే’ అని అనకుండా అస్సలు ఉండలేరు. కొన్నేళ్ల ముందు వరకు హీరోయిన్ గా సూపర్ ఫేమ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్య కాలంలో మాత్రం సైడ్ క్యారెక్టర్ రోల్స్ చేస్తూ, మరోవైపు షోల్లో జడ్జిగా కనిపిస్తూ తెగ సందడి చేస్తుంది. మరి ఇంతలా చెప్పాం కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. చాలామంది హీరోయిన్లు ‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అనే సామెతని పక్కగా పాటిస్తూ ఉంటారు. అంటే అందంగా ఉన్న టైంలోనే మూడు సినిమాలు-ఆరు షోలు చేస్తూ డబ్బులు సంపాదించుకోవాలి. మధ్యమధ్యలో హాట్ ఫొటోషూట్స్ తో అందరినీ ఎట్రాక్ట్ చేయాలి. ఇవన్నీ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ శ్రద్ధాదాస్. పైన ఫొటోలో ఉన్నది కూడా ఆమెనే. తెలిసినంత వరకు ఆమె చిన్నప్పుడు ఫొటోని అయితే మీలో ఎవరూ కూడా గుర్తుపట్టి ఉండకపోవచ్చు అనిపిస్తుంది. ప్రస్తుతం ‘ఢీ’ షోకి జడ్జిగా చేస్తున్న శ్రద్ధా దాస్.. తెలుగు సినిమాతోనే నటిగా మారింది.
ముంబయిలో పుట్టి పెరిగిన శ్రద్ధా దాస్.. అల్లరి నరేష్ ‘సిద్ధు ఫ్రమ్ సికాకుళం’ చిత్రంతో(2008) నటిగా మారింది. ఆ తర్వాత ఆర్య 2, డార్లింగ్, మొగుడు, గుంటూరు టాకీస్, డిక్టేటర్, గరుడవేగ తదితర హిట్ సినిమాల్లో నటించింది. చివరగా ‘నిరీక్షణ’, ‘అర్థం’ మూవీస్ లో హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతం మాత్రం టీవీ షోల్లో కనిపిస్తూ తెగ సందడి చేస్తోంది. ‘ఢీ’ డ్యాన్స్ లో పర్మినెంట్ జడ్జి అయిపోయిన శ్రద్ధా.. మిగతా షోల్లో అప్పుడప్పుడు డ్యాన్స్ ఫెర్ఫార్మెన్సులు ఇస్తూ కనిపిస్తుంది. తాజాగా ఈమె చిన్నప్పటి ఫొటో ఒకటి వైరల్ అయింది. మరి శ్రద్ధాదాస్ చైల్డ్ హుడ్ పిక్ చూసి మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.